Home Latest News Samosa | సమోసాలో ఎలుక.. తినేప్పుడు బయటపడటంతో దడుసుకున్న కస్టమర్‌.. సిద్దిపేట జిల్లాలోనే!

Samosa | సమోసాలో ఎలుక.. తినేప్పుడు బయటపడటంతో దడుసుకున్న కస్టమర్‌.. సిద్దిపేట జిల్లాలోనే!

Image Source : unsplash

Samosa | సమోసా చాలామందికి ఫేవరేట్‌ స్నాక్‌. కొంతమంది ఆలూ సమోసాలను ఆవురావురంటూ తినేస్తే.. మరికొందరు ఆనియన్ సమోసాలను లొట్టలేసుకుని తింటారు. నాన్‌ వెజ్‌ ప్రియులైతే చికెన్‌, కీమా సమోసాలను లాగించేస్తారు. దేనితో చేశారనేది పక్కన బెడితే సమోసాలు అంటే మాత్రం చాలామంది ఇష్టంగా తినేస్తుంటారు. మరి అలా ఇష్టంగా తింటున్న సమోసాలో నుంచి కుళ్లిపోయిన ఎలుక పంటికి తాకితే ఎలా ఉంటుంది. వినడానికి కడుపులో దేవేసినట్టు అనిపిస్తుంది కదూ ! సిద్దిపేట జిల్లా రాఘవపూర్‌లో ఓ వ్యక్తి ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది.

సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాఘవాపూర్‌కు చెందిన అథికం వెంకటస్వామి అనే వ్యక్తి గ్రామ శివారులో ఉన్న సిటీ ప్యాలెస్‌లో సమోసా తినేందుకు వెళ్లాడు. సమోసా తింటుండగా అతని పంటికి ఏదో వింతగా తగిలింది. అనుమానం వచ్చి చూస్తే అందులో కుళ్లిపోయిన ఎలుక ఉంది. అది చూసి ఒక్కసారిగా వెంకటస్వామికి కడుపులో తిప్పినట్టయింది. వెంటనే వెళ్లి హోటల్‌ నిర్వాహకుడికి చూపించాడు. ఇదేంటని అడిగితే సమోసాలోకి ఎలుక ఎలా వచ్చిందో తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అంతే ఒళ్లు మండిన వెంకటస్వామి హోటల్‌ నిర్వాహకుడిపై సీరియస్‌ కావడంతో పక్కన ఉన్నవారందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జరిగిన తప్పిదానికి హోటల్‌ యజమాని క్షమాపణ చెప్పాడు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటానని చెప్పి.. అప్పటికే తయారుచేసిన 130 సమోసాలను బయటపడేశాడు.

Follow Us : Google News, FacebookTwitter

Read more Articles:

Kamareddy | కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. అసలేం జరిగింది ?

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Manikrao Thakre | తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జిగా మాణిక్‌ రావ్‌ థాక్రే

Telangana Congress | టీ కాంగ్రెస్‌ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్‌.. త్వరలో కొత్త ఇంఛార్జి

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version