Thursday, April 18, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana Inter exams schedule| తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి...

Telangana Inter exams schedule| తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు..

Telangana Inter exams schedule | తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు శనివారం వెల్లడించింది. ఫ్రిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్‌ ఉంటాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

మరోవైపు ఎథిక్స్ అండ్ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష మ్చా 4వ తేదీన జరగుతుందని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను మార్చి 6వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు నవీన్‌ మిట్టల్‌ వెల్లడించారు.

వొకేషనల్‌ విద్యార్థులకు ప్రత్యేక షెడ్యూల్‌

జనరల్‌ కోర్సులకు మాత్రమే ఈ షెడ్యూల్‌ వర్తించనుంది. వొకేషనల్‌ విద్యార్థులకు వేరుగా పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తామని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. కరోనా ముందు ఎలా అయితే ఉందో అలాగే.. ఇంటర్‌ పరీక్షలు, ప్రాక్టికల్స్‌కు వంద శాతం సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ షెడ్యూల్‌

మార్చి 15 సెకండ్ లాంగ్వేజ్‌
పేపర్‌ 1

మార్చి 17 ఇంగ్లీష్‌ పేపర్‌
పేపర్‌ 1

మార్చి 20 గణితం పేపర్‌ 1A
బోటనీ పేపర్‌ 1
పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 1
మార్చి 23 గణితం పేపర్‌ 1B
జువాలజీ పేపర్‌ 1
హిస్టరీ పేపర్‌ -1

మార్చి 25 ఫిజిక్స్‌ పేపర్‌ -1
ఎకనామిక్స్‌ పేపర్‌ -1

మార్చి 28 కెమిస్ట్రీ పేపర్‌ -1,
కామర్స్‌ పేపర్‌ -1

మార్చి 31 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌ -1
బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌ -1 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్‌ 3 మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1
జాగ్రఫీ పేపర్‌ -01


ఇంటర్‌ సెకండియర్‌ షెడ్యూల్‌

మార్చి 6 రెండోభాష పేపర్‌ -2

మార్చి 18 ఆంగ్లము పేపర్‌ -2

మార్చి 21 గణితం పేపర్‌ -2ఏ
బాటనీ పేపర్‌ -2
పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ -2

మార్చి 24 గణితం పేపర్‌ -2బీ
జువాలజీ పేపర్‌ -2
హిస్టరీ పేపర్‌ -2

మార్చి 27 ఫిజిక్స్‌ పేపర్‌ -2
ఎకనామిక్స్‌ పేపర్‌ -2

మార్చి 29 కెమిస్ట్రీ పేపర్‌ -2
కామర్స్‌ పేపర్‌ -2

ఏప్రిల్‌ 1 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌ -2
బిడ్జ్రికోర్సు గణితం పేపర్‌ -2 (బైపీసీ విద్యార్థులకు)

ఏప్రిల్‌ 4 మాడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2
జాగ్రఫీ పేపర్‌ -2

inter exams, inter exams shedule, board of intermediate , naveen mittal, telangana news, telugu news, inter results, intermediate,

Follow Us : FacebookTwitter

Read More Articles |

5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ ఇవే

Leopard entered in hetero lab | హైదరాబాద్ శివారులోని హెటిరో ల్యాబ్‌లో చిరుత.. 11 గంటలు కష్టపడి పట్టుకున్న అధికారులు

Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News