Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHealthHair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త

Hair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త

Hair fall |చాలామందికి రాత్రిపూట స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఆఫీసుకు లేదా బయటకు వెళ్లి ఇంటికి రాగానే చాలామంది స్నానం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ మాట నిజమే కానీ రాత్రిపూట తలస్నానం మాత్రం చేయకపోవడమే బెటర్. దానివల్ల ఎంత ప్రమాదమో ఇప్పుడు చూద్దాం..

  • మామూలు జుట్టు కంటే తడి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. కాబట్టి రాత్రిపూట తల స్నానం చేసి అలాగే పడుకుంటే.. తడిగా ఉండటం వల్ల దిండు, బెడ్కు వెంట్రుకలు అంటుకుంటాయి.
  • తలస్నానం చేసిన వెంటనే చిక్కులు తీయడాన్ని చాలామంది బద్ధకంగా ఫీలవుతారు. లేదా జుట్టు ఆరలేదనే సాకుతో అలాగే నిద్రపోతారు. పొద్దున చూసేసరికి జుట్టు ఉండలు కడుతుంది.
  • జుట్టు సరిగ్గా ఆడకముందే పడుకోవడం వల్ల వెంట్రుకలు చిక్కులు పడే అవకాశం ఉంది.
  • జుట్టులో తేమ ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి.
  • రాత్రి పూట తలస్నానం చేయడం వల్ల తల అంతా భారంగా అనిపిస్తుంది. దీనివల్ల మైగ్రేన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
  • ఒకవేళ రాత్రిపూట తలస్నానం తప్పనిసరి అయితే జుట్టు మొత్తం ఆరేదాకా వెయిట్ చేయాలి. వెంట్రుకలు పూర్తిగా ఆరిన తర్వాతే జడవేసుకోవాలి. జుట్టు చిక్కుపడకుండా ఉండేందుకు మంచి కండీషనర్లను వాడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News