Home Latest News Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా...

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

Telangana CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. మైండ్ స్పేస్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రోకు ( Hyderabad Express Metro ) కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంపై పొగడ్తల వర్షం కురిపించారు. చరిత్రలోనూ వర్తమానంలోనూ హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నగరం అన్ని రంగాల్లోనూ డెవలప్ అవుతుందన్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణ రంగం పుంజుకుందన్నారు.

ఎయిర్ పోర్టులోనూ విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయిందని, అందుకు అనుగుణంగా రెండో రన్ వే కూడా వస్తుందన్నారు. అందుకే మెట్రో రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రపంచంలో కాలుష్యరహితమైనటువంటి, ట్రాఫిక్ రద్దీని నియంత్రించగలిగే ఏకైక మార్గం హైదారాబాద్ మెట్రో అని, దీన్ని మరింత విస్తరిస్తామని అన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి మెట్రో రావాల్సి ఉందని అన్నారు . అంతే కాదు భవిష్యత్తులో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో రైల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Exit mobile version