Home News AP Cyclone Mandous | తీవ్ర తుఫానుగా మారిన మాండౌస్.. ఏపీ, తమిళనాడుపై తీవ్ర ప్రభావం

Cyclone Mandous | తీవ్ర తుఫానుగా మారిన మాండౌస్.. ఏపీ, తమిళనాడుపై తీవ్ర ప్రభావం

Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను (cyclone mandous ) తీవ్ర రూపం దాల్చింది. తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దిశగా వేగంగా దూసుకొస్తోంది. శనివారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మాండౌస్ ప్రభావంతో రాయలసీమ, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కరైకాల్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను పన్నెండు కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మాండౌస్ ప్రభావంతో తిరుపతిలో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని ఆరు జిల్లాల్లో సుమారు కోటిమందిపై తుఫాను ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తుఫాను ప్రభావంతో ఏపీలోని బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో రెండో ప్రమాద హెచ్చిరిక జారీ చేశారు. మరోవైపు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇప్పటికే తమిళనాడులోని తరువళ్లూరు, తంజావూరు, చెంగల్పట్లు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Hyderabad Express Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Exit mobile version