Home Latest News CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే...

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Hyderabad Express Metro | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే హైదరాబాద్ కు గొప్ప చరిత్ర ఉందని, దేశంలోనే సుప్రసిద్ధ నగరమని కొనియాడారు. దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో, జనాభాలో పెద్దగా ఉన్న నగరమని అన్నారు. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యమని అన్నారు. దేశంలో ఇప్పుడున్న నగరాలన్నింటికంటే ముందే హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉండేదన్నారు. హైదరాబాద్ నగరానికి విద్యుత్ వచ్చిందని, ఆ తర్వాత పదిహేనేండ్ల తర్వాత చెన్నై నగరానికి అంటే ఆనాటి మద్రాస్ నగరానికి 1927లో విద్యుత్ రావడం జరిగిందన్నారు. చరిత్రలో నిజమైన కాస్మొపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, మతాలను , కులాలను , ప్రాంతాలను, జాతులను హైదరాబాద్ హక్కున చేర్చుకుని ఒక అద్భుతమైన విశ్వనగరంగా మారిందన్నారు. ఇప్పుడు మెట్రో రైల్ ఎయిర్ పోర్టు కనెక్టివిటీ కోసం ముందుకు సాగుతూ మరో ముందడుగు వేసిందన్నారు.

చరిత్రలోనే కాదు వర్తమానంలోనూ గొప్పదే..

హైదారాబాద్ నగరం చరిత్రలోనే కాదు వర్తమానంలోనూ చాలా గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ నగరంలో లేనటువంటి అద్భుతమై సమశీతల వాతావరణం ఉన్న నగరం మన హైదరాబాద్ అని అన్నారు. భూకంపాలు రాకుండా భూగోళంలోనే సేఫెస్ట్ నగరం హైదరాబాద్ అని అన్నారు. అన్ని భాషలు మాట్లాడే వాళ్లు, అన్ని సంస్క్రతులు, వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ ప్రాంతానికి 300 ఏండ్ల క్రితం ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయ్యారు.

హైదరాబాద్ ఇప్పుడు పవర్ ఐలాండ్..

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కరెంట్ కష్టాలు విపరీతంగా ఉండేవి. పరిశ్రమల ప్రతినిధులు కరెంట్ ఇస్తారా.. వేరే రాష్ట్రాలకు వెళ్లమంటారా అని ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఉండేది. నగరంలో ఏ గల్లీలో చూసినా భయంకరమైన నీటి కష్టాలు ఉండేవి. ఆ బాధలు వర్ణణాతీతంగా ఉండేవి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నీళ్లు లేక ఇబ్బందులు పడ్డాం. గోదావరి, కష్ణా నది నుంచి నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసినా.. నత్తనడకన పనులు నడిచినయ్. తెలంగాణ వచ్చినంక నీటి కష్టాలకు చెక్ పెట్టినం. ఇప్పుడు 24 గంటల్లో ఒక క్షణం కూడా కరెంట్ పోకుండా చేసుకున్నాం. నేను పట్టుబట్టి హైదరాబాద్ ను పవర్ ఐ ల్యాండ్ గా మార్చిన. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ లతోని, స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ తోని, నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ తోని అనుసంధానించినం. ఒక్కమాటలో చెప్పాలంటే న్యూయార్క్ నగరం, లండన్, పారిస్ లో కరెంట్ పోవచ్చు కానీ.. హైదరాబాద్ నగరంలో కరెంట్ పోదు. ఇంత గొప్పగా మార్చకున్నాం కాబట్టే హైదరాబాద్ లో 590 వరకు గొప్ప గొప్ప ఐటీ పరిశ్రమలు కొలువుదీరుతున్నయ్. ప్లైఓవర్లు, అండర్ పాసులు ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నాం అంటూ హైదరాబాద్ పరిస్థితుల గురించి సీఎం కేసీఆర్ వివరించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Hyderabad Metro | మాకూ మెట్రో కావాలి.. హైదరాబాద్‌ ప్రజలు కొత్త డిమాండ్లు

Exit mobile version