Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsBandi Sanjay | బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన వరంగల్ కోర్టు.. కరీంనగర్...

Bandi Sanjay | బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన వరంగల్ కోర్టు.. కరీంనగర్ జైలుకు బీజేపీ చీఫ్ తరలింపు?

Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. టెన్త్ ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ కేసులో మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని తన నివాసంలో బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కాసేటి క్రితం వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి అనిత రాపోలు ఎదుట హాజరుపరిచారు. అరెస్టు సమయంలో తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని.. తన శరీరంపై అయిన గాయాలను జడ్జికి బండి సంజయ్ చూపించారు. అయితే కాపీయింగ్ ప్లాన్‌తో రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ కుట్ర చేశారన్న పోలీసుల వాదనతో జడ్జి ఏకీభవించారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. దీంతో ఈ నెల 19 వరకు బండి సంజయ్ రిమాండ్‌లోనే ఉండనున్నారు. బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించే అవకాశం ఉంది.

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120బీ, సెక్షన్ 420 కింద కూడా కేసులు పెట్టారు. మొత్తంగా బండి సంజయ్‌పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

బండి సంజయ్‌తో పాటు మరో 8 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ5గా శివగణేశ్, ఏ6గా పోగు సుభాశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. ఏ4గా మైనర్ బాలుడిని చేర్చారు. వీరిలో నలుగుర్ని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రిమాండ్ కాపీలో ఈటల రాజేందర్ పీఏల పేర్లు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేందర్‌కు ప్రశాంత్ క్వశ్చన్ పేపర్ ఫార్వర్డ్ చేశారని సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSC Paper Leak | బండి సంజయ్‌ను ఎవరూ ఇరికించలేదు.. ఈటలకు కూడా టెన్త్ పేపర్ ఫార్వర్డ్ అయ్యింది.. సంచలన విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ

Hairsh Rao | పట్టపగలే బండి సంజయ్ దొరికిపోయిండు.. టెన్త్ పేపర్ లీకేజీ కుట్రపై మంత్రి హరీశ్ రావు ఫైర్

Bandi Sanjay | పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఏ-1గా బండి సంజయ్.. రిమాండ్ కాపీలో ఈటల రాజేందర్ పీఏ పేర్లు

Bandi Sanjay | బండి సంజయ్‌పై పెట్టిన కేసులు ఇవే.. ఎఫ్‌ఐఆర్‌లో ఏం పేర్కొన్నారంటే..

Siddipet | సిద్దిపేట అడిషనల్‌ కలెక్టర్‌పై వీధికుక్క దాడి.. వాకింగ్‌ చేస్తుండగా పిక్కపట్టి కొరికేసిన శునకం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News