Home Latest News Minister KTR | మాది దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు.. మోదీ, ఆదానీపై తెలంగాణ...

Minister KTR | మాది దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు.. మోదీ, ఆదానీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్

Minister KTR | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను అధికార పార్టీ మంత్రులు ధీటుగా తిప్పి కొడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వేసిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎవరో ఒకరి కోసమో.. లేదా స్నేహితుల కోసమో పని చేసే రాష్ట్రం తెలంగాణ కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ పరిశ్రమలకు మాత్రమే అనుకూలమైన రాష్ట్రం తప్ప.. ఎవరో ఒక్కరికి అనుకూలం కాదంటూ తనదైన స్టైల్ లో కేటీఆర్ సమాధానమిచ్చారు. సింగరేణి గనుల కేటాయింపుల గురించి ఈటల ప్రశ్నించగా ఈ మేరకు కేటీఆర్ బదులిచ్చారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని డిస్కంలకు గతంలో కేంద్రం లేఖలు రాసిందని కేటీఆర్ గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో వస్తున్న దేశీయ బొగ్గును కొనుగోలు చేయకుండా.. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం ఆదేశించిందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఆదేశాన్ని జారీ చేసిందో బీజేపీ నేతలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి మోదీ ఆస్ట్రేలియా, ఇండోనేసియా మరో దేశం వెళ్లి వచ్చిన కేవలం రెండు నెలలకే ఆయన దోస్తులకు అక్కడి బొగ్గుగని లీజు దొరుకుంతుందని కేటీఆర్‌ ఆరోపించారు. దోస్తుల కోసం పని చేసే ప్రభుత్వం తెలంగాణలో లేదని స్పష్టం చేశారు. కేంద్రం పరిధిలో ఉన్న కోల్ ఇండియా కన్నా కూడా తెలంగాణలో ఉన్న సింగరేణి పనులు ఎంతో మెరుగైన ఫలితాలను అందుకుంటున్నాయని వివరించారు.

సింగరేణి వరుసగా ఆరు సార్లు కేంద్రం వద్ద నుంచి అవార్డులు అందుకుందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలని ఎవరు చూస్తున్నారంటూ కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. అసలు విశాఖ ఉక్కును అమ్మడానికి సరైన కారణం చెప్పాలని.. సింగరేణికి ఎందుకు గనులు కేటాయించలేదని కేంద్రాన్ని నిలదీయాలంటూ ఈటలకు కేటీఆర్‌ చురకలు అంటించారు.

కరోనా తర్వాత కేంద్రం 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొందని గుర్తుచేసిన కేటీఆర్.. దాని గురించి వివరాలు తెలుపుతూ శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా అని కేటీఆర్ సవాల్‌ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతున్నారు… ఇద్దరు కొనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పేదలకు, రైతులకు రూపాయి గ్రాంట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క ఫార్మా సంస్థ కూడా లేని యూపీ బల్క్ డ్రగ్‌ పార్క్‌ ఇచ్చారన్న కేటీఆర్.. డ్రగ్‌ హబ్‌‌గా ఉన్న హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మేము స్టార్టప్‌ లు అంటుంటే… బీజేపీ మాత్రం ప్యాకప్ లు అంటోందని విమర్శించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral news | భార్యను పెట్రోల్‌ బంక్‌ దగ్గర వదిలేసి.. పరాయి వ్యక్తి భార్యను బైక్‌పై ఎక్కించుకెళ్లిన భర్త

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version