Home News AP Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి...

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Pawan Kalyan | తన యాత్రను అడ్డుకుంటే ఉగ్రవాదిని అయిపోతా అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. పవన్ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని.. రాష్ట్రంలో ఎవరికి కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడని మంత్రి ప్రశ్నించారు. ఓ తెగ ఆవేశపడిపోతే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

పవన్ పిచ్చెక్కినట్టు మాట్లాడుతుండటంతో తాము కూడా మాట్లాడక తప్పడం లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏమి లేని ఆకు మాత్రమే ఎగిరెగిరి పడుతోందని సెటైర్లు వేశారు. రిపబ్లిక్‌ రోజు ఎవరైనా హుందాగా మాట్లాడుతారని.. పవన్ కళ్యాణ్ మాత్రం ఇష్టారీతిలో మాట్లాడరని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్‌కు, కేఏ పాల్‌కు పెద్ద తేడా ఏముందని సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద బండి కొనుక్కుని ఉంటాడు.. దాంట్లో ఏముంది.. ఎందుకు ఈ పనికిమాలిన మాటలు అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలు అంటేనే విరక్తి పుడుతుందని సెటైర్ వేశారు. అతనికి ఓ సబ్జెక్టు అనేదే లేదు. అసలు పార్టీకి ఓ విధానమే లేదు. ఇప్పటికీ ఎప్పటికీ మూడు రాజధానులే తమ విధానమని మంత్రి బొత్స పేర్కొన్నారు. కానీ తమది మూడు రాష్ట్రాల విధానం మాత్రం కాదన్నారు. 26 జిల్లాల అభివృద్ధి, ఐదు కోట్ల ప్రజల సంక్షేమమే తమ విధానమని స్పష్టం చేశారు.

అసలు పవన్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ అభివృద్ధి చేస్తుంటే అసలు పవన్‌ ఎందుకో బాధపడుతున్నాడో చెప్పాలని కోరారు. రాజకీయాలంటే రెచ్చగొట్టడం అనుకుంటున్నారా అని నిలదీశారు. అసలు పవన్‌ యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నీ బస్సు యాత్రను ఎవరు ఆపుతారు? ఎందుకు అడ్డుకుంటారు? మేము ఏమైనా అడ్డుకుంటామని చెప్పామా అంటూ పవన్‌‌ను ప్రశ్నించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Spouse Category | దిగివచ్చిన ప్రభుత్వం… తెలంగాణలో టీచర్ల స్పౌజ్‌ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

TSPSC Syllabus | గ్రూప్ 3 సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

Exit mobile version