Thursday, June 13, 2024
- Advertisment -
HomeLatest NewsBreaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Breaking News | పండుగ నాడు ఉచిత చీరల పంపిణీ… తొక్కిసలాటలో నలుగురు మృతి!

Breaking News | ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారని మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తిరుపత్తూర్‌ జిల్లాలో వాణియంబాడి మురుగన్‌.. ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ సంస్థ హిందూ ప్రజలు జరుపుకునే తైపూసం పండగ సందర్భంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంతో స్థానికంగా ఉండే వందలాది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వారందరినీ చూసిన సంస్థ నిర్వాహకులు పక్కనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పడంతో మహిళలు అంతా ఒక్కసారిగా అటు వైపునకు పరుగులు పెట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఇక అందులో చిక్కుకున్న నలుగురు మహిళలు ఊపిరాడక చనిపోయారు. మరో 10 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటన పై వెంటనే స్పందించిన సంస్థ ప్రతినిధులు గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురించి కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. తైపూసం పండుగ నాడు నలుగురు మహిళలు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vani Jairam | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ వాణీ జయరాం కన్నుమూత!

Vani Jairam | వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు…పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాతే ఓ క్లారిటీ!

Vani Jairam | వాణీ జయరాం కుటుంబ నేపథ్యం తెలుసా.. ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది!

Minister KTR | అవును మాది కుటుంబ పాలనే… ఆ కుటుంబానికి పెద్ద కేసీఆర్‌!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News