Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsDemonitisation | నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58...

Demonitisation | నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా 58 పిటిషన్లు

Demonitisation | పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 2016 నవంబర్ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా 58 ఫిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై జస్టిస్ ఎస్. ఏ. నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యలు ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదన్న ధర్మాసనం.. ప్రభుత్వ చర్యలను సమర్థించింది. 2016 నవంబర్ 8 నాటి నోటిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వెనుక మూడు లక్ష్యాలను గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఆ లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని తేడాలు ఉన్నా.. వాటి ఆధారంగా నిర్ణయాన్ని కొట్టేయలేమని తేల్చి చెప్పింది. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ గవాయ్ తెలిపారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో కేంద్రం వైఖరిని జస్టిస్ నాగరత్న ఒక్కరే తప్పుపట్టారు.

సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం డీమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, కానీ కేంద్రం రివర్స్‌లో వెళ్లిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పి. చిదంబరం, ప్రశాంత్ భూషన్ వాదించారు. ప్రభుత్వ నిర్ణయం తర్వాతనే సెంట్రల్ బోర్డుకు తెలిపారంటూ వాదనలు వినిపించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారన్నది సరికాదని కేంద్రం తరఫున న్యాయవాదులు వాదించారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Delhi High Court | భార్య నగలపై భర్త ఆశపడటం నేరమే.. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

World’s Toughest Exams | ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్‌ 3 పరీక్షలు ఇవే.. వీటిలో పాస్‌ అయితేనే ఉద్యోగం, ఉన్నత చదువులు!

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News