Viral | మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏం మాట్లాడినా.. ఏం చేసినా ఏమనరు. చాలా విషయాల్లో మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ మరెక్కడా ఉండదు. మనం రోజూ చేసే పనులు, అలవాట్లే కొన్ని దేశాల్లో నేరాలుగా పరిగణించి జరిమానాలు విధిస్తారు. ఆ చట్టాలేంటి.. వాటికి పడే జరిమాణాలేంటో చూడండి మరి..

మనకు నచ్చిన ఆహారం కనిపిస్తే ఇట్టే లాగించేస్తాం. ఏదైనా నచ్చింది తాగలనిపిస్తే కడుపు పగిలిపోతుందా అనిపించేంత వరకు తాగేస్తాం. పొట్ట.. పెద్ద కుండలా తయారైనా మనకు సంబంధం లేదన్నట్లుగా మన పని మనం కానిచ్చేస్తుంటాం. బాగా లావయ్యాక మాత్రం ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తుంటాం. అలా ఆలోచిస్తూ కూడా ఇంకాస్త ఎక్కువ తింటుంటాం. చివరికి జిమ్ములు, వాకింగులని బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తాం.
కానీ జపాన్‌లో అలా కాదు. ఎవరిని చూసినా చాలా స్లిమ్ముగా కనిపిస్తుంటారు. ఎందుకంటే.. అక్కడ లావుగా అయ్యారంటే నేరంగా పరిగణిస్తారు. ఇందుకోసం 2008లో మెటబో లా పేరుతో జపాన్ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం 40-75 ఏళ్ల వయసు వాళ్లు లావెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని సంస్థలు ప్రతి ఒక్కరికీ ఏటా ఆరోగ్య పరీక్షలు చేస్తారు. పొట్టభాగంలో కొలతలు తీసుకుంటారు. పురుషుల పొట్ట 33.5 అంగుళాలు, మహిళల పొట్ట 35.5 అంగుళాలకు మించొద్దు. అంతకుమించి పెరిగితే బరువు తగ్గేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చేరుస్తారు. బరువు తగ్గేలా కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రజలకు జరిమానా విధించరు కానీ బరువు తగ్గించలేకపోతే మాత్రం ఆయా సంస్థలకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ నిబంధనను జపాన్‌లో అందరూ కచ్చితంగా పాటించాల్సిందే.

అక్కడ గాలిపటాలు ఎగరేస్తే నేరం..
మన దగ్గర సంక్రాంతి వచ్చిందంటే చాలు ఏ బంగ్లా మీద చూసినా పతంగులు ఎగరేస్తూ చిన్నా పెద్దా సరదాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో గాలిపటాలు ఎగిరేయడంపై నిషేధం విధించారు. 1966లోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి పార్కులు, మార్కెట్లు, పబ్లిక్ ప్లేసుల్లో గాలిపటాలు ఎగిరేస్తే భారీగా జరిమానా విధిస్తారు. అది 165 డాలర్ల నుంచి 826 డాలర్ల వరకు ఉంటుంది.

పావురాలకు ఆహారమిస్తే జరిమానా
హైదరాబాద్‌లోని చార్మినార్, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్కు వంటి కొన్ని ప్రదేశాల్లో పావురాలకు ఆహారం వేసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు. వాటికి వేసే గింజల కోసం ప్రత్యేకంగా దుకాణాలు కూడా ఉంటాయి. కానీ వెనిస్‌లో మాత్రం పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించారు. అలా ఎవరైనా పావురాలకు ఆహారం వేసినట్లు కనిపిస్తే 700 డాలర్ల జరిమానా వేస్తారట.

బయట బట్టలు ఎండేస్తే నేరం
మన దేశంలో ఏ ఊరుకు వెళ్లినా ఇంటి మందు దండాల మీద బట్టలు ఆరేయని ఇల్లు ఉండదు. కానీ కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో ఐలాండ్‌లో మాత్రం అలా ఆరుబయట బట్టలు ఎండేయడం నేరం. బయటకు కనిపించేలా బట్టలు ఎండేస్తే 200 డాలర్ల జరిమానా లేదా నెల రోజుల జైలు శిక్ష ఉంటుంది. మన దేశంలో కూడా ఇలాంటి చట్టం తెస్తే.. అందరూ జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో కదా!
Read More Articles |
Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?
Rishab Pant | టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు
Heeraben | సామాన్యురాలే కానీ.. శక్తిమంతురాలు.. ప్రధాని మోదీ భావోద్వేగం
Heeraben modi | ప్రధాని మోదీకి మాతృ వియోగం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
Pele | సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత.. క్యాన్సర్‌తో చివరివరకు పోరాడి..
TSPSC Group 2 Notification | గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. కేటగిరీల వారీగా ఇవీ ఖాళీలు