Thursday, March 28, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowWorld's Toughest Exams | ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్‌ 3 పరీక్షలు ఇవే.. వీటిలో...

World’s Toughest Exams | ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్‌ 3 పరీక్షలు ఇవే.. వీటిలో పాస్‌ అయితేనే ఉద్యోగం, ఉన్నత చదువులు!

World’s Toughest Exams | ఇంటర్‌ తర్వాత మెడిసిన్‌ చదవాలన్నా, ఇంజినీరింగ్‌ చదవాలాన్నా ఎంట్రన్స్‌ టెస్ట్‌ రాయాల్సందే. చదువు పూర్తయి ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నా కానీ పోటీ పరీక్షలు రాయాల్సిందే. చేరబోయే కోర్సు, చేయబోయే ఉద్యోగాన్ని బట్టి పరీక్షలు ఉంటాయి. కొన్నైతే మన సహనాన్ని పరిక్షీంచేందుకే పెట్టారా అనేలా పరీక్షలుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కఠినమైన పరీక్షలేంటివో ఓసారి లుక్కేయండి.

Image Source: wikipedia

గోకావ్‌

చైనాలో నిర్వహించే జాతీయ కాలేజీ ప్రవేశ పరీక్షనే గావ్‌కోవ్‌. చైనాలో ఇంటర్‌ పూర్తయిన ప్రతి విద్యార్థి డిగ్రీ చేయాలంటే ఈ పరీక్ష రాయాల్సిందే. అన్ని పరీక్షల్లా కాకుండా ఇది రెండు రోజుల 10 గంటలుంటుంది. మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఇంకా పొడిగించుకునే ఛాన్స్‌ కూడా ఉంది. గణితం, ఆర్థమెటిక్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్‌, చైనీస్‌ సాహిత్యం, జాగ్రఫీ, పొలిటికల్‌ సైన్స్‌ నుంచి ఈ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీలో నచ్చిన కోర్సులో చేరొచ్చు. యూరప్‌, అమెరికా కాలేజీల్లోనూ వీటిలో వచ్చే మార్కులను పరిగణనలోకి తీసుకుని సీట్లిస్తారు.

యూపీఎస్సీ..

భారత్‌లో కేంద్ర ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షనే యూపీఎస్సీ‌. ప్రతి సంవత్సరం కచ్చితంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఉంటాయి. వీటిలో అర్హత సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే ఉద్యోగం లభిస్తుంది.

మాస్టర్‌ సొమెలియర్‌ డిప్లొమా పరీక్ష..

మద్యం నాణ్యతను గుర్తించేందుకు ప్రత్యేక నిష్ణాతులు ఉంటారు. వీరిని తయారు చేసేందుకే మాస్టర్‌ సొమెలియర్‌ డిప్లొమా పరీక్ష. ఇందులో పాస్‌ అయిన వారికే యూకేలోని కోర్ట్‌ ఆఫ్‌ మాస్టర్‌ సొమెలియర్స్‌ అనే విద్యాసంస్థలో సీటు దొరుకుతుంది. ఈ పరీక్షలో మూడు దశలు అనగా.. థియరీ, ప్రాక్టికల్స్‌, టెస్టింగ్‌ ఉంటాయి. థియరీలో వైన్‌ తయారు చేసేందుకు అవసరమైన ద్రాక్షలు ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కడ లభిస్తాయి.. మద్యంలో రకాలు, మద్యంపై అంతర్జాతీయ చట్టాలు, విధానాలు ఎలాగున్నాయి అనే విషయాలపై పరీక్ష ఉంటుంది. ప్రాక్టికల్స్‌లో కస్టమర్లకు ఎలాంటి మద్యం ఇవ్వాలి, వారికి నచ్చేట్లు ఎలాంటి మద్యం సిఫార్సు చేయాలి.. మద్యాన్ని ఏవిధంగా తయారు చేయాలనే దానిపై ఉంటుంది. టెస్టింగ్‌లో ఆరు రకాల వైన్‌ అక్కడ పెట్టి వాటికి సంబందించిన ఫుల్‌ డీటెయిల్స్‌ అడుగుతారు. అవన్నీ సక్రమంగా చెబితేనే ఈ పరీక్షలో పాసై.. కోర్ట్‌ ఆఫ్‌ మాస్టర్‌ సొమెలియర్స్‌ లో సీటు లభిస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News