Home Latest News TSPSC | పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి నోటీసులు

TSPSC | పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి నోటీసులు

TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పేపర్ లీకేజీకి పాల్పడిన ఇంటి దొంగల గుట్టు రట్టు చేసిన సిట్ వారిని విచారించి కీలక విషయాలను రాబట్టింది. ఇప్పుడు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ సహా కమిషన్ సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు పంపించింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా సిట్ విచారించనుంది.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్.. సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు పీఏగా ఉన్నాడు. ఏ-2 రాజశేఖర్ రెడ్డి లింగారెడ్డికి పీఏగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారించిన సిట్ పలు కీలక విషయాలను తెలుసుకుంది. నిందితుల పెన్ డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలను గుర్తించింది. వీటిలో జూలైలో జరగాల్సిన పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా ఉన్నాయి. ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో లక్షల కొద్ది డబ్బు చేతులు మారినట్లు కూడా సిట్ విచారణలో వెల్లడైంది. దీంతో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే కాకుండా పై అధికారులకు ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు పంపించింది. అవసరమైతే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను కూడా విచారించాలని సిట్ భావిస్తోంది.

రంగంలోకి ఈడీ?

పేపర్ లీకేజీ వ్యవహారంలో లక్షల కొద్దీ డబ్బు చేతులు మారినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. పైగా ఈ లీకేజీతో టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అనధికారిక లావాదేవీల గుట్టు విప్పేందుకు ఈడీ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసే దర్యాప్తు చేయనుందని తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Exit mobile version