Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsAPChandrababu Road show | చంద్రబాబు రోడ్‌ షోలో అపశృతి.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. మరికొందరి...

Chandrababu Road show | చంద్రబాబు రోడ్‌ షోలో అపశృతి.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. మరికొందరి పరిస్థితి విషమం

Chandra babu Road show | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌ షోలో అపశృతి చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షోలో తొక్కిసలాట జరిగింది. ఏడుగురు కార్యకర్తలు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్‌ షో ప్రాంగణం ఆర్తనాదాలతో దద్దరిల్లి పోయింది. తొక్కిసలాట జరిగిన సమయంలో కొందరు పక్కనున్న కాలువలో పడిపోయారు.

ప్రమాద ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన విషయం తెలుసుకున్న చంద్రబాబు.. రోడ్‌ షో మధ్యలోనే ఆపేసి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

మృతుల వివరాలివే..

కందుకూరులో చంద్రబాబు రోడ్‌ షోలో జరిగిన తొక్కిసలాటలో దేవినేని రవీంద్ర (ఆత్మకూరు), కలవకురి యానాది (కొండముడుసుపాలెం), యటగిరి విజయ (ఉలవపాడు ), కకుమాను రాజా (కందుకూరు ), మరలపాటి చిన్నకొండయ్య (గుళ్ల పాలెం ), పురుషోత్తం (కందుకూరు ) మృతి చెందినట్టు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News