Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowDogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Dogs | రాత్రిపూట ఒక్కోసారి కుక్కలు అరవడం గమనించే ఉంటారు? వీధుల్లోని శునకాలు అన్ని ఒక్క చోట చేరి ఆకాశం వైపు చూస్తూ అలా అరుస్తుంటే చాలా భయపడిపోతుంటాం. కొందరైతే ఏదైనా కీడు జరుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. కానీ అసలు అవి ఎందుకు అరుస్తాయి? దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది మాత్రం చాలామంది ఆలోచించి ఉండరు.

ఇప్పుడైతే శునకాలు మనుషులకు దగ్గరయ్యాయి. కానీ అంతకుముందు తమ జాతికే చెందిన నక్కలు, తోడేళ్లతో కలిసి అడవిలోనే ఉండేవి. తర్వాత కాలంలో నక్కలు, తోడేళ్లు అడవిలోనే ఉండిపోతే శునకాలు మాత్రం మనుషులతో కలిసిపోయాయి. కానీ అడవిలో ఉన్నప్పుడు ఏర్పడిన అలవాట్లను మాత్రం ఇప్పటికీ మానలేకపోతున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే పెంపుడు శునకాలు అయినప్పటికీ ఏదైనా స్తంభం, చెట్టు మొదట్లోకి వెళ్లి మూత్ర విసర్జన చేస్తుంటాయి. అలాగే పడుకునే ముందు గుంతలు తవ్వడం చేస్తుంటాయి. ఏదైనా వస్తువు దొరికినా గుంతలు తవ్వి పాతిపెడుతుంటాయి. వాటిచుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి. ఇవన్నీ అరణ్యంలో ఉన్నప్పుడు ఏర్పడిన అలవాట్లే. మనుషులతో మమేకమై ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఈ అలవాట్లను కుక్కలు మార్చుకోలేకపోతున్నాయి.

అడవిలో ఉండే సమయంలో శునకాలు వేటాడి ఆహారాన్ని సమకూర్చుకునేవి. సరిపోయినంత తిని మిగిలిన ఆహారాన్ని భూమిలో గొయ్యి తవ్వి దాచిపెట్టుకునేవి. పరిస్థితులకు అనుగుణంగా ఆ గుంతలో నుంచి ఆహారాన్ని తీసుకుని తినేవి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు గుంతలు తవ్వి అందులో పడుకునేవి. ఇలా అడవిలో తమ జీవనాన్ని కొనసాగించేవి. చంద్రుడు నిండుగా ఉన్న సమయంలో వేటకు వెళ్లేవి. ఆ సమయంలో దూరంగా ఉన్న తోటి మిత్రులను పిలిచేందుకు ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచేవి. ఇలా అరవడం ద్వారా ఒకదానికొకటి సంకేతాలు పంపించుకునేవి. ఈ అలవాటును శునకాలు ఇప్పటికీ మానుకోలేకపోతున్నాయి. అప్పుడప్పుడు రోడ్లపైకి వచ్చి చంద్రుడి వైపు చూస్తూ గట్టిగా అరుస్తుంటాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News