Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsSSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.....

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

SSC Exams | తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 9, 10 తరగతుల విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచే తాజా సంస్కరణలు అమలు కానున్నాయి.

ప్రతి సబ్జెక్టులో పరీక్షలకు 80 మార్కులు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. ఇక సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికీ సగం సగం మార్కులు వేయనున్నారు. సైన్స్‌ పరీక్షకు 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ఆరు పేపర్లతో వంద శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వ్యాసరూప ప్రశ్నలకే ఇంటర్నల్‌ ఛాయిస్‌ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్‌ లేదన్నారు. పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా బోధించాలని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News