Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentAvatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్...

Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..

Avatar2 Collections | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 2 కాసుల వర్షం కురిపిస్తోంది. పండోరా గ్రహంలోని అద్భుతాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ క్రేజ్‌తో రెండు వారాల తర్వాత కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీసు వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తుంది. అవతార్ 2 సినిమా విడుదలైన 12 రోజుల్లోనే బిలియన్ డాలర్లను వసూలు చేసింది. అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాల 8,200 కోట్లు అన్నమాట.

జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా 10 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు దాదాపు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ వచ్చింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరిట వచ్చిన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. వాళ్ల ఎదురుచూపులకు తగ్గట్టుగా క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మిక్స్‌డ్ వచ్చినప్పటికీ.. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండటంతో టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను రాబడుతోంది.బాక్సాఫీసు దగ్గర ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తుంది. అవతార్ విడుదలైన 12వ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మొత్తంగా బిలియన్ డాలర్లను రాబట్టింది.

తెలుగులోనూ భారీ కలెక్షన్స్

హాలీవుడ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అవతార్ 2 సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఇప్పటివరకు 72.53 కోట్లు వసూలు చేసింది. నైజాంలో రూ.38.78కోట్లు, సీడెడ్‌లో రూ.8.58 కోట్లు, ఏపీలోని అన్ని ఏరియాలు కలిపి రూ.25.17 కోట్లు రాబట్టింది. ఒక్క 12వ రోజునే 2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే అవతార్ మానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియా వ్యాప్తంగా ఈ సినిమా రూ.317.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

లాభాలు రావాలంటే ఇంకో బిలియన్ కావాల్సిందే

అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది. అందులో సగం కలెక్షన్లను 12 రోజుల్లోనే రాబట్టింది. ఇప్పుడు అవతార్ 2 సినిమాకి ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే మరో బిలియన్ డాలర్లు రావడం పెద్ద కష్టమేమీ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Matti Kusthi in Ott | ఓటీటీలోకి వచ్చేస్తున్న మట్టి కుస్తీ.. స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

Anupama Parameswaran | అమ్మో అనుపమ రెమ్యునరేషన్‌ ఒక్కసారిగా అంత పెంచేసిందా?

Prabhas | ప్రభాస్‌, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాపై క్లారిటీ వచ్చేసిందిగా..

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News