Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsNikki Yadav | ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో యువతి హత్య.. కారులో హత్య...

Nikki Yadav | ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలో యువతి హత్య.. కారులో హత్య చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన బాయ్‌ఫ్రెండ్!

Nikki Yadav | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే యువతిని హత్య చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.

అసలేం జరిగిందంటే..

ఢిల్లీకి చెందిన సాహిల్ (24), హరియాణాకు చెందిన నిక్కీ యాదవ్ (23) ప్రేమలో ఉన్నారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు కోచింగ్ తీసుకోవడం కోసం నిక్కీ యాదవ్ ఢిల్లీకి వచ్చింది. అక్కడే సాహిల్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సాహిల్‌కు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. దీంతో కొద్ది రోజులుగా నిక్కీ యాదవ్‌ను దూరం పెడుతున్నాడు.

ఈ విషయంలో నిక్కీ, సాహిల్ మధ్య గొడవలయ్యాయి. తనను పెళ్లి చేసుకోవాలని సాహిల్‌పై నిక్కీ ఒత్తిడి తెచ్చింది. ఎక్కడ తన పెళ్లిని అడ్డుకుంటుందో అన్న అనుమానంతో అదే రోజు నిక్కీని సాహిల్ కారులో బయటకు తీసుకొచ్చాడు. కారులోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కారులోని డేటా కేబుల్‌తో నిక్కీ గొంతుకు బిగించి హత్య చేశాడు.

అనంతరం దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఆ తర్వాత తన కుటుంబానికి చెందిన దాబాలోని ఫ్రీజర్‌లో దాచిపెట్టాడు. ఏమీ ఎరగనట్టు వెళ్లి నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రెండు మూడు రోజులకు ఫ్రీజర్‌లో మృత దేహం ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.

నాలుగు రోజులుగా తమ కూతురు కనిపించడం లేదని నిక్కీ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిక్కీ కోసం వెతకగా ఫిబ్రవరి 14న ఓ దాబాలోని ఫ్రీజర్‌లో నిక్కీ మృత దేహం దొరికింది. సీసీటీవీ ఫుటేజీలో అసలు భాగోతం బయటపడింది. పోలీసులు సాహిల్‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ కోర్టు అతడికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

కాగా తమ కు కుమార్తెను హత్య చేసిన వాడిని చచ్చే వరకు ఉరితీయాలని నిక్కీ తండ్రి డిమాండ్ చేశాడు. తమ కుమార్తె మరణ వార్త తట్టుకోలేకపోతున్నామని, నిక్కీని నెలన్నర క్రితం కలిసినట్లు మీడియాతో చెప్పాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News