Wednesday, July 24, 2024
- Advertisment -
HomeEntertainmentDhanush Sir | 'సార్' ప్రివ్యూ.. ధనుష్ కు తెలుగు మార్కెట్ ఓపెన్ అవుతుందా..?

Dhanush Sir | ‘సార్’ ప్రివ్యూ.. ధనుష్ కు తెలుగు మార్కెట్ ఓపెన్ అవుతుందా..?

Dhanush Sir | తమిళంలో వరుస సినిమాలు చేస్తూనే మిగిలిన ఇండస్ట్రీలపై కూడా ఫోకస్ చేశాడు ధనుష్. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు చేశాడు. అక్కడ కూడా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. అలాగే హాలీవుడ్ లో కూడా పరిచయమయ్యాడు ధనుష్. ఇప్పుడు ఈయన చూపు తెలుగు ఇండస్ట్రీపై పడింది. అందుకే టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు ఈ కోలీవుడ్ హీరో.

తాజాగా ఆయన నటించిన తొలి తెలుగు సినిమా సార్ ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కనీసం మౌలిక సదుపాయమైన వైద్యం, విద్య అందుబాటులో లేకుండా పోతుంది.. దాన్ని కావాలనే కొందరు డబ్బుల కోసం దూరం చేస్తున్నారనే సున్నితమైన విషయాన్ని ఇందులో చెప్పాడు వెంకీ అట్లూరి. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి కంప్లీట్ లవ్ స్టోరీ తర్వాత దర్శకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్నాడు వెంకీ అట్లూరి.

తాను రాసుకున్న కథకు ధనుష్ లాంటి పర్ఫార్మర్ ను తీసుకొని సగం సక్సెస్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. పైగా ఈ సినిమాకు త్రివిక్రమ్ కూడా సహనిర్మాతగా ఉండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా సార్ సినిమాను నిర్మించాయి.

రఘువరన్ బీటెక్, నవ మన్మధుడు లాంటి ఒకటి రెండు డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ స్ట్రైట్ మార్కెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వెంకీ అట్లూరి తర్వాత శేఖర్ కమ్ముల కూడా లైన్లో ఉండడంతో సార్ సక్సెస్ కీలకంగా మారింది. తమిళంలో ఈ సినిమాను వాతి పేరుతో తీసుకొస్తున్నారు. అక్కడ భారీ అంచనాల మధ్య విడుదలవుతుంది సార్.

పైగా మొన్న సంక్రాంతికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు తమిళంలో మంచి విజయం సాధించింది. దాంతో ఇక్కడి దర్శకులపై తమిళనాట అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగి సార్ సినిమా మంచి విజయం సాధిస్తే మాత్రం ధనుష్ కు తెలుగులో మార్కెట్ ఓపెన్ కావడం ఖాయం. ఇది శేఖర్ కమ్ముల సినిమాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది.

పూర్తి సందేశాత్మక కథతో వస్తున్న సార్.. 20 ఏళ్ల కింద నేపథ్యంతో సాగుతుంది. ప్రీ రిలీజ్ వేడుకలో ఈ సినిమా గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడారు. సినిమాలో కూడా నిజంగా అంత విషయం ఉంటే ధనుష్ పంట పండినట్టే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News