Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentMegastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Megastar Chiranjeevi | రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. దానికి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా రూ. 140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీలోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో టాప్ 5 లో నిలిచింది. రాజమౌళి సినిమాలను పక్కన పెడితే అల వైకుంఠపురంలో తర్వాత వాల్తేరు వీరయ్య రెండో స్థానంలో ఉంది. ఇంత పెద్ద విజయం రావడంతో చిరంజీవి ఉప్పొంగిపోతున్నాడు.

మార్కెట్ ఇంకా అలాగే ఉన్నందుకు పండగ చేసుకుంటున్నాడు. తనకు సరైన సినిమా పడితే ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చిరంజీవికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందుకే నెక్స్ట్ ఏం చేయాలి అనే కంగారు కూడా ఆయనలో ఎక్కువైపోయింది. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోనే జరుగుతుంది.

దీనికోసం ప్రత్యేకంగా కలకత్తా సెట్ వేశారు. ఈ సినిమా నేపథ్యం కూడా కోల్ కతా లోనే ఉంటుంది. ఆరేళ్ల కింద తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన వేదాలం సినిమాకు రీమేక్ ఇది. కమర్షియల్ మాస్ సినిమాగా వస్తున్న భోళా శంకర్ కచ్చితంగా మెగా ఫాన్స్ కు పండగలా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నాడు మెహర్ రమేష్. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఏం చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి ఎవరితో చేయాలి అనే విషయంపై చిరంజీవి చాలా రోజులుగా తర్చన భజన పడుతూనే ఉన్నాడు.

ఇప్పటికే కమిట్ అయిన వెంకీ కుడుముల సినిమా కథ నచ్చలేదని పక్కన పెట్టాడు. పూరి జగన్నాథ్ కథ సిద్ధం చేస్తున్నాడు కానీ.. ఆయనపై నమ్మకంతో చిరంజీవి ముందడుగు వేస్తాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే లైగర్ ఫ్లాప్ తర్వాత పూరితో సినిమా అంటే భయపడుతున్నారు హీరోలు. అలాంటిది ఆయనను నమ్మి చిరంజీవి సినిమా చేస్తాడా అనేది అనుమానమే. ఇదిలా ఉంటే చిరంజీవి దర్శకుల లిస్టులో త్రినాధరావు నక్కిన కూడా ఉన్నాడు.

ఈయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాస్ డైరెక్టర్స్ కూడా చిరంజీవితో రెగ్యులర్‌గా టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరికి ఓకే చెప్తాడు అనేది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతానికి ఒక రకమైన మెగా గందరగోళం అయితే చిరంజీవి బుర్రలో నడుస్తూనే ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News