Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (19-06-2023)

Daily Horoscope | రాశిఫలాలు (19-06-2023)

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. పెట్టుబడికి స్వల్ప లాభం దక్కుతుంది. సంతానం నుంచి ధన, వస్తు లాభం కలుగుతుంది.

వృషభం

నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం

నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో బాధ్యత పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

తుల

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృశ్చికం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభ సూచన ఉంది.

ధనుస్సు

మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్య అవకాశాలను అందుకుంటారు.

మకరం

కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విద్య, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.

కుంభం

దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలుసుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వాస్తు లాభ సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Advantage of cycle | సైకిల్ గురించి ఈ విశేషాలు తెలుసా? సైకిల్ వాడితే బీపీ, షుగర్ ను కంట్రోల్ చేయొచ్చా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Bill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ ఫోన్ మాత్రం అస్సలు కాదు!

Exit mobile version