Home Latest News Pension for Farmers | రైతులకు నెలనెలా రూ. 3 వేల పింఛన్.. ఎలా వస్తుందంటే..!

Pension for Farmers | రైతులకు నెలనెలా రూ. 3 వేల పింఛన్.. ఎలా వస్తుందంటే..!

Pension for Farmers | రైతులకు భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో పథకం ప్రవేశపెట్టింది. ఇప్పటికే రైతు రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు.. పెట్టుబడి సాయం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు పింఛన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన ( PM Kisan Mandhan Yojana ) పథకాన్ని తీసుకొచ్చింది.

ఎవరికి వర్తిస్తుంది?

పీఎం కిసాన్ మాన్‌ధన్ పథకం కింద 60 సంవత్సరాలు నిండిన రైతులు నెలకు రూ.3వేల వరకు పింఛన్ పొందవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కనీసం రెండు హెక్టార్ల వరకు సాగుభూమిని కలిగి ఉండాలి. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అతనికి 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు 3వేల పింఛన్ అందుతుంది. ఈ డబ్బులు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో నెల నెల జమ అవుతాయి. లబ్ధిదారుడు మరణిస్తే అతని జీవిత భాగస్వామికి 50 శాతం పింఛన్ వస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో పథకంతో లబ్ధి పొందుతున్న వ్యక్తులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో చేరాలనుకునే రైతు దగ్గరలోని ఈసేవ లేదా మీ సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే రైతులు తమ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

Exit mobile version