Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLatest NewsVinod Kambli | క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వినోద్‌...

Vinod Kambli | క్రికెటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వినోద్‌ కాంబ్లీ

Vinod Kambli | ముంబై: మైదానంలో ఆట కంటే.. స్టేడియం వెలువల ఆటేతర విషయాలతో తరచూ వార్తల్లో ఉండే భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ.. మరోసారి చిక్కుల్లో పడ్డాడు. చెడు వ్యసనాలతో కెరీర్‌ను నాశనం చేసుకున్న కాంబ్లీ.. తాజాగా భార్యపై దాడి చేసి వార్తల్లోకెక్కాడు. కాంబ్లీ సతీమణి ఆండ్రియా ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దుర్భాషలాడటంతో పాటు మద్యం మత్తులో దాడికి పాల్పడినట్లు కాంబ్లీపై ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఆండ్రియా తలకు గాయమవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తనపై దాడి చేశాడని కాంబ్లీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా.. కాంబ్లీని మాత్రం అదుపులోకి తీసుకోలేదు.

వంటసామాగ్రి (కుకింగ్‌ పాన్‌)తో తనపై దాడి చేసినట్లు.. ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన శుక్రవారం జరిగినట్లు ఆమె వెల్లడించింది. దీనిపై స్పందించిన పోలీసులు ఆండ్రియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.

ఐపీసీ సెక్షన్‌ 324, ఐపీసీ సెక్షన్‌ 504 సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వివరించారు. ఇలాంటి దుందుడుకు ప్రవర్తనతోనే భారత జట్టుకు దూరమైన కాంబ్లీ.. మద్యం మత్తులో తనపై దాడి చేసినట్లు ఆండ్రియా వెల్లడించింది. 12 ఏళ్ల కుమారుడు చూస్తుండగానే తనపై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆమె పేర్కొంది.

రంజీల్లో తొలి బంతికే సిక్సర్‌

స్ట్రోక్‌ ప్లేయర్‌గా 1991లో భారత వన్డే జట్టులోకి వచ్చిన వినోద్‌ కాంబ్లీ.. మరో రెండేళ్లలో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున దేశవాళీల్లో మెరుపులు మెరిపించి జాతీయ జట్టులోకి వచ్చిన కాంబ్లీ.. ఆరంభంలో తన దూకుడైన ఆటతో అభిమానులు మనసులు చూరగొన్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి ఆడిన వినోద్‌ కాంబ్లీ.. స్కూల్‌ లెవల్‌ క్రికెట్‌లో అరుదైన ఘనత లిఖించాడు.

సచిన్‌, కాంబ్లీ జంట పాఠశాల స్థాయి టోర్నీలో తొలి వికెట్‌కు 664 పరుగులు జతచేసి రికార్డు సృష్టించింది. ప్రతిభతో రంజీ ట్రోఫీ అవకాశం దక్కించుకున్న వినోద్‌ కాంబ్లీ.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌ బాది తానేంటో నిరూపించుకున్నాడు. జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి ఏడు టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు, రెండు సెంచరీలతో క్రికెట్‌ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న కాంబ్లీ.. కెరీర్‌ ఆసాంతం అదే జోరు కనబర్చలేకపోయాడు.

షేన్‌ వార్న్‌నే వణికించి..

అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వార్న్‌ను వినోద్‌ కాంబ్లీ ఒక ఆట ఆడుకున్నాడు. అతడి బంతి ఎదుర్కోవాలంటేనే మిగిలిన ఆటగాళ్లు భయపడే సమయంలో.. కాంబ్లీ అతడికి చుక్కలు చూపాడు. వార్న్‌ వేసిన ఒకే ఓవర్‌లో 22 పరుగులు సాధించి అదరహో అనిపించాడు.

అయితే క్రమశిక్షణా రాహిత్యం అతడి కెరీర్‌ను నాశనం చేసింది. వన్డే జట్టులోకి తరచూ వస్తూ పోతూ తొమ్మిది సార్లు కమ్‌బ్యాక్‌ చేసిన కాంబ్లీ.. 24 ఏళ్లు నిండకముందే 1995లో తన చివరి టెస్టు ఆడాడు. అప్పుడప్పుడు వన్డే జట్టులోకి వస్తూ పోతూ ఉన్న కాంబ్లీ.. 2000 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. సహచరుడు రికార్డుల మీద రికార్డులు తిరిగరాసి భారతరత్న అవార్డు అందుకుంటే.. అతడికంటే ప్రతిభలో ఒక ఆకు ఎక్కువే చదివాడనుకున్న కాంబ్లీ మాత్రం ఇలా గృహహింసకు పాల్పడుతూ కేసుల పాలవుతున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News