Tuesday, July 23, 2024
- Advertisment -
HomeNewsInternationalPakistan vs Afghanistan | పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్‌ షాక్‌.. తొలిసారి టీ20 మ్యాచ్‌లో గెలుపు

Pakistan vs Afghanistan | పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్‌ షాక్‌.. తొలిసారి టీ20 మ్యాచ్‌లో గెలుపు

Pakistan vs Afghanistan | టైమ్‌ 2 న్యూస్‌, షార్జా: పొట్టి సిరీస్‌లో పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో అఫ్గాన్‌ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో పాక్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.

అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న అఫ్గానిస్థాన్‌.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి పాకిస్థాన్‌ పని పట్టింది. తటస్థ వేదికపై జరిగిన పోరులో అఫ్గాన్‌ సత్తాచాటింది. అఫ్గానిస్థాన్‌ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ నాయకత్వంలో బరిలోకి దిగగా.. పాకిస్థాన్‌ ఈ సిరీస్‌ నుంచి తమ ప్రధన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌తో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ లేకుండానే పాకిస్థాన్‌ బరిలోకి దిగింది. స్టార్ల గైర్హాజరీలో షాదాబ్‌ ఖాన్‌ పాక్‌ జట్టుకు నాయకత్వం వహించాడు.

ఒకరి వెంట ఒకరు..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్‌కు మూడో ఓవర్‌లోనే భారీ షాక్‌ తగిలింది. మహమ్మద్‌ హారిస్‌ 6 పరుగులే చేసి పెవిలియన్‌ బాట పట్టగా.. అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం మ్యాచ్‌ ముగిసేవరకు కొనసాగింది. అబ్దుల్లా షఫీఖ్‌ (0), ఆజమ్‌ కాన్‌ (0) సున్నాలు చుట్టగా.. అయూబ్‌ 917), తయ్యబ్‌ తాహిర్‌ (16), ఇమాద్‌ వసీమ్‌ (18), షాదాబ్‌ కాన్‌ (12) తలా కొన్ని పరుగులు చేయడంతో పాకిస్థాన్‌ చివరకు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.

అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో మహమ్మద్‌ నబి, ముజీబ్‌ రహమాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్‌ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 రన్స్‌ చేసింది. నబి (38 నాటౌట్‌) రాణించాడు. పాక్‌ బౌలర్లలో ఇన్సానుల్లా రెండు వికెట్లు తీశాడు. చేజింగ్‌లో అఫ్గాన్‌ ఒక దశలో 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా.. నబి క్రీజులో ఎదురు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో తమ జట్టులో ఆత్మవిశ్వాసం నింపిందని రషీద్‌ అన్నాడు.

‘‘పాకిస్థాన్‌పై తొలి విజయం సాధించినందకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మేం చాలాసార్లు పాకిస్థాన్‌పై గెలుపునకు చేరువగా వచ్చాం. కానీ అప్పుడు సరిగ్గా ముగించలేకపోయాం. ఈ సారి ఆ తప్పు చేయకుండా చివరి వరకు పోరాటం కొనసాగించడంతో మ్యాచ్‌ మా వశమైంది. అఫ్గానిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. మ్యాచ్‌లో విజయం సాధించినా.. మా టాపార్డర్‌ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది’’ అని మ్యాచ్‌ అనంతరం అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | సారీ చెప్పేందుకు సావర్కర్‌ని కాదు.. ఎంపీగా అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి

Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News