Home News International COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు...

COVID in China | చైనాలో 90 కోట్ల మందికి సోకిన కరోనా.. ఇంకో రెండు నెలల్లో మరింత విజృంభించే ఛాన్స్

COVID in China | చైనాను కరోనా వైరస్ ఇంకా వదలట్లేదు. జీరో కొవిడ్ విధానం ఎత్తివేసినప్పటి నుంచి అక్కడ వైరస్ విజృంభిస్తోంది. ఈ నెల 11 నాటికి చైనాలో 60 శాతం మంది కరోనా పరినపడ్డారు. అంటే మొత్తం 90 కోట్ల మందికి కొవిడ్ సోకింది. పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 141 కోట్ల మంది జనాభా ఉన్న చైనాలో అత్యధికంగా గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం ( 23.9 కోట్లు), యునాన్‌లో 84 శాతం, కింఘైలో 80 శాతం మంది కరోనా బారినపడ్డారు.

ఇప్పటివరకు కరోనా వైరస్ వ్యాప్తి పట్టణాల్లోనే ఎక్కువగా ఉంది. కానీ ఈ నెల 23న చైనా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో వేడుకలు జరుపుకునేందుకు పట్టణాల్లోని లక్షలాది మంది తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో మరో రెండు మూడు నెలల పాటు కరోనా ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ అధిపతి జెంగ్ గువాంగ్ అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

LPG Cylinder | సిలిండర్ తీసుకొచ్చినందుకు రూ.30 అడిగిన డెలివరీ బాయ్.. గ్యాస్ ఏజెన్సీకి లక్ష రూపాయలు ఫైన్

Air India | ఎయిరిండియా మూత్ర విసర్జన కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమెపైనే శంకర్‌ ఆరోపణలు!

Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

Exit mobile version