Home Entertainment Ramcharan | రెండేళ్లలో ఆరు సినిమాలు.. రామ్ చరణ్ జోరు మాములుగా లేదుగా

Ramcharan | రెండేళ్లలో ఆరు సినిమాలు.. రామ్ చరణ్ జోరు మాములుగా లేదుగా

Ramcharan | మెగా ట్యాగ్ మెడలో వేసుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. కెరీర్ బిగెనింగ్‌లో తన నటన, లుక్స్‌ను హేళన చేసిన వారితోనే ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు గ్లోబల్ వైడ్ గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ తో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. RC15 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి హాలీవుడ్ మీడియాకు చెప్పి అందరినీ ఆశ్యర్యంలో పడేశాడు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొన్న రామ్ చరణ్.. హాలీవుడ్ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. వెరైటీ మ్యాగజైన్‌కు చెందిన మార్క్ మాల్కిన్‌కు చరణ్ ఓ ఇంటర్వూ ఇచ్చాడు. తన సినిమాలకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. మార్వెల్ స్టూడియోస్ నుండి ఫోన్ వస్తే సినిమా చేస్తారా? అని మార్క్ అడిగిన దానికి చరణ్.. తప్పకుండా చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఛాన్స్ వస్తే హాలీవుడ్ డైరెక్టర్లతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపాడు. అలాగే తన తదుపరి సినిమాల గురించి కూడా పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం తన చేతిలో ఆరు సినిమాలు ఉన్నట్లు చరణ్ తెలిపాడు. అందులో ఈ ఏడాది మూడు సినిమాలు ఒప్పుకున్నట్లు, వచ్చే ఏడాది కోసం మరో మూడు సినిమాలకు సైన్ చేశానని చెప్పాడు. దాంతో అటు మెగా అభిమానులు, ఇటు ప్రేక్షకులు ఆశ్చర్యంలో పడిపోయారు. ఆ ఆరు సినిమాలేంటా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటివరకు RC15తో పాటు బుచ్చిబాబుతో సినిమా మాత్రమే లైన్ లో ఉన్నట్లు అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది. వీటితో పాటుగా ఇటీవలే సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు గాసిప్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే అది నిజమేనని తెలుస్తుంది. పుష్ప-2లో చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా ఇస్తాడని సమాచారం. దీనితో పాటుగా ప్రశాంత్ నీల్ తో ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో తెరకెక్కబోయే ఓ సినిమాలో చరణ్ నటిస్తాడని సమాచారం. ఇదే కాకుండా మరో కన్నడ డైరెక్టర్ నార్తన్ కు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. నార్తన్ చెప్పిన కథ బాగా నచ్చడంతో చరణ్ వెంటనే ఓకే చేశాడట. వీటితో పాటుగా లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. దళపతి67, ఖైదీ సీక్వెల్ తర్వాత లోకేష్ చరణ్ తో ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడట. వీటిన్నిటిలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికైతే రానున్న రెండు, మూడేళ్ల వరకు తన కెరీర్ ను చరణ్ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Shruti Haasan | నా జ్వరం కాస్త మానసిక సమస్యగా మారిందన్నమాట.. అనారోగ్య వార్తలపై స్పందించిన శ్రుతిహాసన్‌.

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Exit mobile version