Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalOmicron BF.7 | చైనాలో రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు. లండన్...

Omicron BF.7 | చైనాలో రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు. లండన్ సంస్థ నివేదికలో సంచలన విషయాలు

Omicron BF.7 | చైనాలో జీరో కొవిడ్ విధానం ఎత్తేయడమే కొంపముంచిందా? ప్రజల ఆందోళనకు తలొగ్గి జిన్‌పింగ్ తప్పు చేశాడా? మరికొద్ది రోజుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 చైనాలో మరింత విలయం సృష్టించనుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. జీరో కొవిడ్ విధానం వెనక్కితీసుకోవడంతోనే భారీగా కేసులు నమోదవుతున్నాయని అంచనా వేస్తున్నారు.

చైనాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. అక్కడ రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయని, దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని లండన్‌కు చెందిన ఎయిర్ ఫినిట్ సంస్థ అంచనా వేసింది. మరికొద్ది రోజుల్లో కరోనా కేసులు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 2023 జనవరిలో చైనాలో రోజుకు 37 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది. మార్చి నాటికి మరింత విజృంభించే ఛాన్సుందని, దాదాపు రోజూ వారీ కేసుల సంఖ్య 42 లక్షలకు చేరుకోవచ్చని పేర్కొంది. చైనాలో మరో 90 రోజుల్లో దాదాపు 60 శాతం మందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు నిపుణులు అంచనా వేశారు.

ప్రస్తుతం చైనాలో రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నా అక్కడి ప్రభుత్వం మాత్రం వేలల్లోనే కేసులు నమోదవుతున్నాయని చెబుతోంది. మరణాల సంఖ్యను కూడా దాచిపెడుతోంది. కరోనా మరణాల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలను మార్చేసి.. సంఖ్య తక్కువ చేసి చూపిస్తోందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లండన్ సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జిన్‌పింగ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకు వాస్తవంగా అక్కడ నమోదవుతున్న కేసులు,మరణాల సంఖ్యకు పొంతన లేదని నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో అమెరికాలో ఒమిక్రాన్ విజృంభించడంతో రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు చైనాలో రోజుకు 30 లక్షల కేసులు నమోదైనా సాధారణమే అని నివేదికలో స్పష్టం చేసింది.

కానీ చైనా మాత్రం రోజుకు 3 వేల కరోనా కేసులే నమోదైతున్నాయని ప్రకటించింది. 24 గంటల్లో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని తెలిపింది. కానీ కరోనా కారణంగా చైనాలో లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. అయినా చైనా మాత్రం అలాంటిదేంలేదని చెబుతోంది. ప్రధాన పట్టణాల్లో శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోతున్నాయని వార్తలు వస్తున్నా చైనా తేలిగ్గా తీసుకుంటోంది. బీజింగ్‌ లాంటి నగరాల్లో సైతం శ్మశాన వాటికలు కొవిడ్‌ మృతులతో నిండిపోతున్నాయని అంతర్జాతీయ మీడియా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, బ్లూమ్ బర్గ్ లాంటి సంస్థలు పేర్కొంటున్నాయి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోనూ చైనా వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bharat Biotech Nasal vaccine | కరోనా విలయతాండవం చేస్తున్న వేళ గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

Harish Rao | ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌.. హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష

Covid situation in china | చైనాలో పరిస్థితి అంత దారుణంగా ఉందా? కరోనా అంతమయ్యేది ఎప్పుడు.. నిపుణుల అభిప్రాయమిదే!

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News