Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsPM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు...

PM Modi meeting on corona | కరోనాపై ప్రధాని మోదీ అత్యున్నత సమావేశం.. ముప్పు తొలగిపోలేదు.. జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచన

PM Modi meeting on corona | దేశంలో కరోనా పరీక్షలు పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. చైనా సహా ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోలేదన్న ప్రధాని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. పండుగల సందర్భంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరోవైపు రాష్ట్రాలకు కూడా ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు పెంచాలని, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేట్లు, వీలైనంత ఎక్కువ మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖలతో పాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రికాషన్‌ డోస్‌ తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు సూచించారు. అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. మందుల ధరలపై కూడా నిఘా పెంచాలని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. చైనా, జపాన్‌ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Corona cases in India | భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ BF.7 కేసులు.. అప్రమత్తమైన వైద్య మండలి.. కీలక ఆదేశాలు జారీ

Metro Wholesale | మెట్రో ఇండియాను కొనుగోలు చేసిన రిలయన్స్.. రూ.2,850 కోట్లకు డీల్ కుదుర్చుకున్న ముకేశ్ అంబానీ

Viral news | అమెరికాలో కోట్ల జీతం వదిలేసి వచ్చి సన్యాసం పుచ్చుకోబోతున్న యంగ్‌ సైంటిస్ట్‌

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News