Home News International Nepal plane crash | భర్త కోసం పైలట్ అవ్వాలని కష్టపడింది.. 16 ఏళ్ల తర్వాత...

Nepal plane crash | భర్త కోసం పైలట్ అవ్వాలని కష్టపడింది.. 16 ఏళ్ల తర్వాత అతనిలాగే ప్రాణాలు కోల్పోయింది.

Nepal plane crash |పైలట్ కావాలని ఆశపడ్డ భర్త ఆ కోరిక తీరుకుండానే మరణిస్తే.. కట్టుకున్నోడి కలను తన కలగా మార్చుకుంది. దానికోసం 16 ఏళ్ల పాటు నిర్విరామంగా కష్టపడింది. తీరా తాను కోరుకున్న రోజు రానే వచ్చింది. కానీ తన కష్టానికి ప్రతిఫలం దక్కడానికి కొద్ది క్షణాల ముందు విధి ఆమెను బలితీసుకుంది. భర్త ఆశయాన్ని సాధించేందుకు తన గమ్యాన్ని మార్చుకుని అతని అడుగుజాడల్లో వెళ్లి.. చివరకు అతనిలాగే ప్రాణాలు పోగొట్టుకుంది. ఇద్దరి మరణానికి ఒకే ఎయిర్‌లైన్స్ విమానం కారణం కావడం ఇక్కడ మరో విషాదం. ఆదివారం జరిగిన నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అంజు ఖటివాడా విషాద గాథ ఇదీ..

నేపాల్‌ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో కో పైలట్ అంజు ఖటివాడా కూడా ఒకరు. ఆ విమానం ల్యాండ్ అయ్యి ఉంటే ఆమె.. పైలట్‌గా పదోన్నతి తీసుకునేది. కానీ ప్రమోషన్ పొందడానికి కొన్ని నిమిషాల ముందే అంజు ప్రాణాలు విడిచింది. ఇక్కడ మరో విషాదం ఏంటంటే.. 16 ఏళ్ల క్రితం అంజు భర్త కూడా అచ్చం ఇలాగే విమాన ప్రమాదంలో మరణించాడు. 2006 లో నేపాల్‌ గంజ్‌ నుంచి జుమ్లాకు బయల్దేరిన ఎయిర్ లైన్స్‌ 9 ఎన్‌ ఏ ఈ క్యూ విమానం… కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. అందులో కోపైలట్ అయిన అంజూ భర్త కూడా ఉన్నాడు. పైలట్ కావాలని ఆశపడ్డ అతను ఆ కోరిక తీరకుండానే విమాన ప్రమాదంలో మరణించాడు.

దీంతో తను అయినా పైలట్‌గా మారి భర్త కోరికను తీర్చాలని అనుకుంది. అందుకే అప్పట్నుంచి చాలా కష్టపడింది. కోపైలట్‌గా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కనీసం 100 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉంటేనే ఆ ప్రమోషన్ రావడం సాధ్యమవుతుంది. ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వడానికి అంజూ చాలా కష్టపడింది. నిన్న నేపాల్‌లో కుప్పకూలిన విమానం సేఫ్‌గా దిగి ఉంటే ఈ ఫీట్ సాధించి అంజూ పైలట్ కావాల్సింది. కానీ ల్యాండింగ్‌కు ముందే అంజూ కలతో పాటు ఆమె ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. అంజూ ప్రాణాలు కోల్పోయిన విమానం.. ఆమె భర్త మరణానికి కారణమైన విమానం రెండూ కూడా ఒకే ఎయిర్‌లైన్స్‌కి చెందినవి కావడం గమనార్హం.

ఆదివారం జరిగిన ప్రమాద సమయంలో అంజుకి కమల్‌ కేసీ అనే వ్యక్తి పైలట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు దాదాపు 35 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉంది. ఆయన ఎందరికో పైలట్ శిక్షణ ఇచ్చారు. ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. నేపాల్‌ లో విమానాన్ని నడపడం కమల్‌ కేసీకి, అంజుకు కొత్తేమీ కాదు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లోనూ వారిద్దరు ఎన్నోసార్లు విమానం నడిపారు. కానీ ఆదివారం మాత్రమే వారి జీవితాల్లో విషాదం నింపింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన

Ratan Tata | తనకు ఇష్టమైన కారు గురించి రతన్ టాటా భావోద్వేగపు పోస్టు.. నెట్టింట వైరల్!

Exit mobile version