Home News AP Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున...

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Image Source: janasena facebook

Hyper Aadi | జబర్దస్ షోలో పంచులతో తనదైన మార్కు చూపించిన హైపర్ ఆది ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ? జనసేన తరఫున ఆ నియోజకవర్గం సీటును ఆది ఆశిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్ల రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలో పవన్‌ కళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేశాడు ఆది. ఏపీ మంత్రులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆకట్టుకునే ప్రసంగం చేసి ప్రజల దృష్టిని కూడా తనవైపు తిప్పుకున్నాడు. ఆది దూకుడు మాటలు చూసిన జనసేన నాయకులు.. ఆదికి తమ పార్టీ నుంచి టికెట్ ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముందునుంచి మెగా ఫ్యామిలీ అంటే ఇష్టపడే హైపర్ ఆదికి ఆ కుటుంబం సినిమాల్లో మద్దతుగానే నిలుస్తోంది. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆదికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే హైపర్ సొంత జిల్లాలోని ఓ నియోజవకర్గం నుంచి పోటీ చేయబోతున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు కుదిరినా ప్రకాశం జిల్లా నుంచి కనీసం రెండు నియోజకవర్గాలు దర్శి, గిద్దలూరు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒక సీటు హైపర్ ఆదికి ఇచ్చే చాన్సుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన ఆదికి దర్శి టికెట్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆది కోసం నాగబాబు కూడా పవన్ కళ్యాణ్‌కు రికమెండ్ చేశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే జనసేన తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Exit mobile version