Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsOmicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం...

Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

Omicron BF.7 variant | చైనాను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 కేసులు ఇప్పటివరకు భారత్‌లో మూడు నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారత్‌లో తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబర్‌లోనే గుర్తించింది.

ప్రస్తుతం చైనాలో రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీనికి కారణం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BF.7 కారణమని అక్కడి అధికారిక వర్గాలు నిర్ధారించాయి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అయితే భారత్‌లో ఈ వేరియంట్‌ అక్టోబర్‌లోనే వెలుగు చూసినప్పటికీ కేసులు గణనీయంగా పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. కానీ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు కాకుండా కొత్తగా బయటపడుతున్న వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ సహా పలు దేశాల్లో బీఎఫ్‌.7 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. అయితే చైనాలో ఇప్పటివరకు ఎక్కువమంది కరోనా ఇన్ఫెక్షన్‌ బారిన పడలేదు. అక్కడి వాళ్లకు రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉండటం వల్ల కరోనా వేగంగా విస్తరిస్తోందని భారత నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్ బీఏ.5 కు చెందిన ఉపరకమే తాజా బీఎఫ్‌.7. దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి చాలా తక్కువ. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఇన్ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం దీనికి ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

Corona Alert | కరోనా అలర్ట్.. అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు విధించే యోచనలో కేంద్రం?

Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News