Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsAdar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక...

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

Adar Poonawalla on corona cases | ప్రపంచదేశాల్లో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనిపై ఇప్పటి ప్రపంచదేశాలు అలర్ట్ అవుతున్నాయి. కేంద్రం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. పాజిటీవ్ కేసులు వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితిపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు.

భారత్‌లో కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ల పంపిణీ భారీగా చేపట్టిన నేపథ్యంలో భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్రం సూచించే నిబంధనలను పాటిస్తే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్ల పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల ఆందోళన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను తప్పనిసరిగా పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు.

మరోవైపు చైనాలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని అపోలో ఆస్పత్రుల ఎండీ డాక్టర్ సంగీత రెడ్డి అన్నారు. చైనాలో కరోనా కేసులు పెరగడం ప్రపంచంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ముఖ్యంగా చైనా నుంచి రాకపోకల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఇప్పటికే చైనా నుంచి విమానాలను నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికల్లో నెటిజన్లు కోరుతున్నారు. భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చైనా నుంచి ఆంక్షలపై నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కాగా, ఇప్పటికే కరోనా పరిస్థితిని అంచనావేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణులతో సమావేశం నిర్వహించింది. కీలక మార్గదర్శకాలు విడుదల చేసే యోచన కేంద్రం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్ వచ్చే ఛాన్స్

Notice for Taj Mahal | చరిత్రలో తొలిసారి తాజ్‌మహల్‌కు నోటీసులు.. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ ఆదేశాలు

Gas cylinder for Rs. 500 | రాజస్థాన్‌లో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News