Home Lifestyle Health Fungus Infections | భారత్‌లో 5.7కోట్ల మందికి ఫంగస్ ముప్పు.. 2.5 లక్షల మంది ప్రాణాలు...

Fungus Infections | భారత్‌లో 5.7కోట్ల మందికి ఫంగస్ ముప్పు.. 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్.. అధ్యయనంలో సంచలన విషయాలు

Fungus Infections | చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తుంటే భారత్‌లో మాత్రం ఫంగస్ ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. దేశ జనాభాలో దాదాపు 4.4 శాతం మందికి ఫంగస్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అధ్యయనంలో వెల్లడైంది.

ఎయిమ్స్ ( న్యూ ఢిల్లీ ), ఎయిమ్స్ ( కళ్యాణి ), ఎయిమ్స్ ( పశ్చిమ బెంగాల్ ), పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఛండీగడ్ ), మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో భారత్‌లో దాదాపు 4.4 శాతం మంది అనగా 5.7 కోట్ల మంది ఫంగస్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ముప్పు పొంచి ఉందని అధ్యయనంలో తేలింది. వీటిలో దాదాపు 10 శాతం అత్యంత ప్రమాదకరమైనవని తేల్చారు. ఊపిరితిత్తులు, సైనస్ సంబంధిత ఇన్ఫెక్షన్ల వల్ల 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలో తేలింది.

దాదాపు 400 పరిశోధన పత్రాల్లో ఉన్న అంశాలపై అధ్యయనం జరిపి ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం దాదాపు రెండున్నర కోట్ల మంది మహిళల్లో గర్భాశయ ముఖద్వారంలో ఇన్ఫెక్షన్లు, స్కూల్ పిల్లల్లో హెయిర్ ఫాల్ సమస్యలు ఏర్పడతాయి. ఇక ఊపిరితిత్తులు, సైనస్ సంబంధిత ఇన్ఫెక్షన్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని దాదాపు 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. 17 లక్షల మందిలో శ్వాస కోశ సమస్యలు, 35 లక్షల మందిలో ఊపిరితిత్తుల్లో సమస్యలు, 10 లక్షల మందిలో కంటికి సంబంధించిన ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక 2 లక్షల మంది మ్యూకర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని నివేదికకు అధ్యక్షత వహించిన ఎయిమ్స్ డాక్టర్ అనిమేశ్ చెప్పారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Brain Eating Amoeba | మెదడు తినేసేస్తున్న అమీబా.. దక్షిణ కొరియాలో గుబులు పుట్టిస్తున్న వింత వ్యాధి లక్షణాలివే.. ఇది సోకిన వాళ్లలో 97 శాతం మృతి!

World’s Deadliest Diseases | ప్రపంచాన్ని భయపెట్టిన 6 అతిపెద్ద మహమ్మారులు.. టెక్నాలజీ, వైద్యులు, పరిశోధనలు లేకున్నా ఎలా అంతమయ్యాయి ?

ath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

umaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Exit mobile version