Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsAPTarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Tarakaratna Health Update | నందమూరి తారకరత్న పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుప్పం శుక్రవారం అర్ధరాత్రి ఆయన్ను ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. నారాయణ హృదయాలంలో డాక్టర్ ఉదయ్ నేతృత్వంలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఐసీయూలో ఉంచి తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. అక్కడ తారకరత్నకు మరోసారి యాంజీప్లాస్టీ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పేరిట శుక్రవారం కుప్పంలో చేపట్టిన పాదయాత్రలో నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది. పాదయాత్రలో భాగంగా కుప్పం దగ్గరలో ఉన్న మసీదులో కూడా లోకేశ్ ప్రార్థనలు నిర్వహించారు. అప్పుడు లోకేశ్‌తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లగా.. ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. గాలి ఆడటం లేదని.. కొంచెం జరగాలని సిబ్బంది ఎంత చెప్పినా అభిమానులు వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఊపిరి అందక సొమ్మసిల్లి పడిపోయాడు. హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను పరీక్షించి గుండెపోటుగా నిర్ధారించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News