Thursday, June 1, 2023
- Advertisment -
HomeNewsAPKodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని...

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Kodali Nani | టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని ఒక అసమర్థుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర కేవలం చందాలు ఇచ్చిన వారికోసం మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. లోకేశ్‌ పాదయాత్ర దేనికి పనికిరాదని సెటైర్లు వేశారు.

అసలు పాదయాత్ర చేస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నారని.. ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. పోటీ చేసిన ఒక్క చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేశ్‌‌కి టీడీపీని అధికారంలోకి తీసుకుని వచ్చే సీనుందా? అంటూ నాని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని వ్యక్తి పాదయాత్ర చేసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని విమర్శించారు.

సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేశారు. విజయాన్ని సాధించారు..అంతే కానీ మూడేళ్లు మూడు శాఖలకు మంత్రిగా పని చేసినప్పటికీ కూడా లోకేశ్‌ను మంగళగిరి ప్రజలు ఇచ్చిన బహుమతి ఏంటంటే ఓటమి. ఈ పాదయాత్ర వల్ల టీడీపీకి, చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వారు యాత్రలు చేస్తే.. వైసీపీ గెలుపు ఇక నల్లేరు మీద నడకే అంటూ వ్యాఖ్యానించారు.

అప్పుడు నందమూరి వారసులకే టీడీపీ

ఎన్టీఆర్ చెమట, రక్తంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని లాగేసుకునేందుకు లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నందమూరి వారసులు మంచి స్థాయిలో ఉన్నారు. వారు ఎక్కడ మళ్లీ పార్టీని తిరిగి లాగేసుకుంటారో అని భయపడి… లోకేశ్‌ ఈ పాదయాత్రకి శ్రీకారం చుట్టాడు. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో కూడా లోకేశ్‌ ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్‌ లేదు. చంద్రబాబుకి వయసు మీద పడింది. అప్పుడు నందమూరి వారసులు టీడీపీని హస్తగతం చేసుకుంటారని కొడాలి నాని జోస్యం చెప్పారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2391 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News