Monday, March 27, 2023
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 28-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 28-01-2023 )

Horoscope Today | మేషం

నూతన యత్నాలు అనుకూలిస్తాయి. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయ సహకారాలు అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్తు లాభ సూచన ఉంది.

వృషభం

చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పోటీ పరీక్షలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహన యోగం ఉంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలను సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన విబేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. అతిథుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం

రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

కన్య

బంధువుల నుంచి సహాయసహకారాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిస్కారమై ఊరట చెందుతారు. నూతన మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త పరచుకోండి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు

తుల

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు అనుకోని అవకాశాలు లభిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ యత్నాలకు కలిసి వచ్చే కాలం. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

ధనుస్సు

మిత్రుల ప్రోత్సాహంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు.

కుంభం

చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితికి అనుకూలమైన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు.

మీనం

ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News