Tuesday, April 16, 2024
- Advertisment -
HomeNewsAPMLC Results | ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అక్కడా అధికార పక్షమే.. ఇక్కడా అధికార పక్షమే!

MLC Results | ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అక్కడా అధికార పక్షమే.. ఇక్కడా అధికార పక్షమే!

MLC Results | రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఏపీలో 4 స్థానిక సంస్థలు, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు నిర్వహించారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నాలుగు ఎంఎల్‌సీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్‌ విజయం సాధించారు. ఇక్కడ 1178 ఓట్లు ఉండగా, 1136 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ మధుసూదన్‌కు 988 ఓట్లు రాగా.. ఇండిపెండెట్‌ అభ్యర్థి గుట్టపాడు మోహన్‌ రెడ్డికి 85 ఓట్లు, మరో ఇండిపెండెట్‌ అభ్యర్థి భూమా వెంకట్‌ గోపాల్‌ రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు.

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీ అభ్యర్థి నత్తు రామారావు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 752 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. వైసీపీకి చెందిన నత్తు రామారావుకు 632 ఓట్లు రాగా.. ఆయన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఆనేపు రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. మరో 12 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీకి చెందిన కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు. జిల్లాలో మొత్తం 1105 ఓట్లు ఉండగా.. 1,088 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కను వినియోగించుకున్నారు. కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు పోలయ్యాయి.

ఇక ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటిగ్ జరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్ త్వరగానే వచ్చే అవకాశం ఉన్నా.. పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన ఫలితాలు మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వాటిని ప్రాధాన్యత క్రమంలో లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

ఇక తెలంగాణలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 13నే ఎన్నిక జరగ్గా.. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరగాల్సి ఉంది. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరి రోజు కాగా, తెలంగాణలో బరిలో ముగ్గురే బరిలో నిలిచారు.

మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ చెల్లదని అధికారులు ప్రకటించారు. దాంతో బరిలో మిగిలిన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Fire Accident | సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు

Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్‌గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్

Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!

Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?

Air India | ఆన్‌లైన్‌లో చూశా.. మీరు ఎక్కువ ఫైన్ వేస్తున్నారు? జడ్జితో లొల్లి పెట్టుకుని జైలుకే వెళ్లిన వ్యక్తి

Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్‌బీసీ

TSPSC | యథావిధిగానే గ్రూప్‌-1 మెయిన్స్.. AE పరీక్షపై నిర్ణయం తీసుకుంటాం: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News