Home Latest News Numaish 2023 | హైదరాబాద్‌లో నుమాయిష్ షురూ.. ఇవీ ప్రత్యేకతలు

Numaish 2023 | హైదరాబాద్‌లో నుమాయిష్ షురూ.. ఇవీ ప్రత్యేకతలు

Image Source: @airnews_hyd twitter

Numaish 2023 | విభిన్న సంస్కృతులు, అహారపు అలవాట్లు, ఉత్పత్తులకు వేదికగా నిలిచిన నుమాయిష్.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మినీ భారత్‌గా పేరొందిన 82వ నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభించిన ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్పత్తులు, హ్యాండీ క్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, తినుబండారాలు సహా అన్నీ ఇందులో లభించనున్నాయి. ఇరాన్ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, బంగ్లాదేశ్ వస్త్రాలు కూడా ఈ నుమాయిష్‌లో లభ్యమవుతాయి.

నుమాయిష్‌ కారణంగా మెట్రో టైమింగ్స్‌లో మార్పులు

కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ ఫీజు విషయానికొస్తే పెద్దలకు రూ.40 వసూలు చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. నుమాయిష్ కోసం హైదరాబాద్‌కు వచ్చే సందర్శకులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. మెట్రో రైలు టైమింగ్స్‌ను కూడా పొడిగించారు. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం కారిడర్లలో రాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు తిరిగేలా ఏర్పాట్లు చేసినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

ఇదీ 82వ నుమాయిష్

కరోనా ప్రభావంతో గత ఏడాది పూర్తిస్థాయిలో నుమాయిష్ కొనసాగించలేకపోయారు. 2021లో కూడా నుమాయిష్ రద్దు చేశారు. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా ఈ 82వ నుమాయిష్ 2600 స్టాళ్లతో అట్టహాసంగా ప్రారంభమైంది.

నుమాయిష్‌ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు

హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ అనేది కంపెనీ యాక్ట్‌ కింద రిజిస్టర్‌ అయిన లాభాపేక్ష లేని సంస్థ. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రతిసారి మంత్రి లేదా స్పీకర్‌ దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. దీని ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. నుమాయిష్‌ వల్ల 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఏటా 25 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | టీడీపీ సభలో తొక్కిసలాటపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. తీవ్రంగా ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

KCR | ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లపై కేసీఆర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. గెలిచినంక కొమ్ములొస్తున్నయ్‌ అంటూ సెటైర్లు!

KCR | ఏపీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Exit mobile version