Home Entertainment Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు...

Jabardast Comedian Kiraak RP | బంపర్ రెస్పాన్స్ ఉన్నా కిరాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసేశాడు.. పగోడికి కూడా ఆ కష్టం రావద్దు

Image Source : Youtube

Jabardast Comedian Kiraak RP | జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి తెలియని వాళ్లుండరు. నెల్లూరు యాసలో ఆయన చేసే కామెడీ, పంచ్ టైమింగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. దీంతో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అలాంటి సమయంలో జబర్దస్త్ మానేసిన ఆర్పీ.. నాగబాబు ఆధ్వర్యంలో స్టార్ట్ అయిన అదిరింది షోలో చేరాడు. అక్కడ రెండు మూడు స్కిట్స్ చేసి అదీ మానేశాడు. తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట ఒక కర్రీ పాయింట్ తెరిచాడు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ కర్రీ పాయింట్‌కు ఇప్పుడు ఓ కష్టమొచ్చిందట. దీంతో వారం రోజుల పాటు తన షాపు క్లోజ్ చేస్తున్నానని కిరాక్ ఆర్పీ తెలిపాడు. అసలు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకు వచ్చిన కష్టమేంటో చూద్దాం..

జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోలతో పాటు సినిమాల్లోనూ కిరాక్ ఆర్పీ నటుడిగా ట్రై చేశాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా కూడా తన టాలెంట్‌ను చూపించాడు. చివరకు ఒక కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్, ఆంధ్రా ఫ్యామిలీలు ఉండే కూకట్‌పల్లి ఏరియాను సెలెక్ట్ చేసుకుని ఈ కర్రీ పాయింట్ తెరిచాడు. సిటీ ఔట్స్‌కట్‌లో కర్రీ వండి.. ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. రూ.40 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాగా క్లిక్ అయ్యింది. దీనికి అలవాటు పడిపోయిన బ్యాచ్‌లర్స్, ఫ్యామిలీ జనాలు ఎగబడి మరీ చేపల పులుసు కొనుక్కెళ్తున్నారు. ఊహించిన దానికంటే డిమాండ్ ఎక్కువ అవ్వడంతో అందరికీ కావాల్సినంత చేపల పులుసును అందించడం కిరాక్ ఆర్పీకి కష్టమైపోతుందట. అందుకే సరిపడా మ్యాన్ పవర్‌ను పెంచుకోవాలని ఆర్పీ భావిస్తున్నాడు. అందుకే అద్భుతంగా చేపల పులుసు వండే వాళ్లతో పాటు హోటల్‌లో పనిచేసే వాళ్ల కోసం వేట ప్రారంభించాడు. దీనికోసం షాప్ క్లోజ్ చేసి కిరాక్ ఆర్పీ నెల్లూరు వెళ్లిపోయాడు.

వంటగాళ్ల కోసం కిరాక్ ఆర్పీ ప్రత్యేకంగా నెల్లూరుకే ఎందుకు వెళ్లాడు అంటే దానికి కారణం ఉంది. మిగిలిన వాళ్లతో పోలిస్తే చేపలు కడిగే పద్ధతితో పాటు కట్టెల పొయ్యిపై చేపల పులుసు పెట్టడంలో నెల్లూరు మహిళలు ప్రత్యేక పద్ధతులను వాడుతారు. అందుకే వాళ్లు చేసిన చేపల పులుసు టేస్టీగా ఉంటుందట. అందుకే వర్కర్ల కోసం నెల్లూరు వెళ్లినట్టు కిరాక్ ఆర్పీ చెబుతున్నాడు. సరిపడా మ్యాన్ పవర్ లేకపోవడంతో డిమాండ్‌కి సరిపడా చేపల పులుసు అందించలేకపోతున్నామని.. దీంతో కష్టమర్లు వెనక్కి వెళ్లిపోవడం చూస్తే బాధగా అనిపిస్తుందని చెప్పాడు. రెండు మూడు రోజులు షాప్ క్లోజ్ ఉన్నా సరే.. సరిపడా వంట మాస్టర్లు, వర్కర్లను తీసుకొని వచ్చి మళ్లీ ఓపెన్ చేస్తానని అంటున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?

Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?

Rashmika Mandanna | రష్మికకు కాంతారా డైరెక్టర్‌కు మధ్య గొడవలేంటి? ఎందుకు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు?

Pavitra Naresh | పవిత్ర లోకేశ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి గుడ్‌ న్యూస్‌ చెప్పిన నరేశ్‌

Exit mobile version