Home News AP West Godavari | యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి.. అడ్డుకున్న తల్లి, చెల్లికి తీవ్ర గాయాలు.....

West Godavari | యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి.. అడ్డుకున్న తల్లి, చెల్లికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

West Godavari | పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో యువతితో పాటు ఆమె తల్లి, సోదరిపైనా కత్తితో విచక్షణా రహితంగా దాడిచేశాడు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.

తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలులో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాజులపాటి కళ్యాణ్ కూలీ చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతిని రెండు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ యువతి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులతో చెప్పడంతో పలుమార్లు కళ్యాణ్‌ను హెచ్చరించారు. దీంతో యువతిపై కోపం పెంచుకున్నాడు. గురువారం రాత్రి యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. యువతి దవడ, మెడ, వెన్నుముక, ఛాతిలో కత్తితో పొడిచాడు. ఆ సమయంలో యువతి తల్లి, చెల్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరింత రెచ్చిపోయిన కళ్యాణ్ వారిపైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని స్థానికులు చికిత్స కోసం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడికి పాల్పడిన కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vegetarian City in India | ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం గురించి తెలుసా ? అదీ.. మన భారత దేశంలోనే ఉంది.. ఎక్కడంటే?

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Exit mobile version