Home Latest News konda surekha resigns | కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన కొండా సురేఖ.. రేవంత్ రెడ్డికి రాజీనామా...

konda surekha resigns | కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన కొండా సురేఖ.. రేవంత్ రెడ్డికి రాజీనామా లేఖ.. అసలేమైంది?

konda surekha resigns | కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి కొండా సురేఖ షాకిచ్చారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ అందించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తన పేరు లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించారు. అంతేకాదు వరంగల్ కు చెందిన ఏ ఒక్క నేత పేరు కూడా కమిటీలో లేకపోవడం బాధ కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీల స్థానం కల్పించి, తనకు చోటు ఇవ్వకపోవడం అవమానించడమే అని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డితో భేటీ అయిన కొండా సురేఖ రాజీనామా లేఖను అందజేశారు. పీసీసీ కమిటీపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. తనలాంటి సీనియర్ నాయకురాలికి పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కొండా సురేఖను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లి పార్టీలో గుర్తింపు వచ్చేలా చేస్తానని కొండా సురేఖకు రేవంత్ హామీ ఇచ్చారు.

కొండా రాజీనామా వెనుక కారణాలు వేరే ఉన్నాయా?

సురేఖ పీసీసీ ఎగ్జిక్యూటీవ్ పదవికి రాజీనామా చేయడం వెనుక కారణాలు వేరే ఉన్నాయని పొలిటికల్ సర్క్సిల్స్ లో వినిపిస్తోంది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో చొటు దక్కకపోవడమే కారణం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక రాజకీయ అంశాలే ఇందుకు కారణం కావొచ్చంటున్నారు.

వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి తన అనుకూల వర్గానికి ఇవ్వాలని రేవంత్ రెడ్డిని సురేఖ కోరినట్లు తెలిసింది. కనీసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని కోరిందట. ఇప్పటికే వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిపై కొండా మురళి, దొంతి మాధవ రెడ్డి మధ్య పోటీ ఉంది. అటు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసంగా జంగా రాఘవరెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. అయితే జంగా కోసం కొండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాలపై కూడా చర్చించినట్లు సమాచారం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ యాప్‌లతో పనిలేదు

5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ ఇవే

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Exit mobile version