Home Entertainment Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం...

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Nandamuri Balakrishna new movie | గత రెండు మూడు సంవత్సరాలుగా బాలకృష్ణ ( Balakrishna ) వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆయన ఎంచుకున్న దర్శకుల శైలి కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒకప్పుడు చిన్న దర్శకులతో అయినా పర్లేదు సినిమాలు చేసే ఈయన.. ఇప్పుడు మాత్రం కేవలం స్టార్ డైరెక్టర్లతో మాత్రమే ముందుకు వెళుతున్నాడు. పైగా బాలయ్య కోసం యంగ్ జనరేషన్ దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బోయపాటితో అఖండ సినిమా చేసిన ఈయన.. ఆ తర్వాత గోపీచంద్ తో వీరసింహారెడ్డి ( veera simha reddy ) అంటూ సంక్రాంతికి వస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

చిరంజీవి వాల్తేరు వీరయ్య ( waltair veerayya ) పోటీలో ఉన్నా కూడా బాలయ్య సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వీరసింహారెడ్డి వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి (Anil raavipudi ) సినిమా మొదలు పెట్టాడు బాలకృష్ణ. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పూర్తిగా బాలయ్య దారిలోకి అనిల్ రావిపూడి వస్తున్నాడు. ఇప్పటి వరకు కెరీర్ మొదలుపెట్టి ఎనిమిదేళ్లయినా కూడా ఎంటర్టైన్మెంట్ ను ఎప్పుడు వదలలేదు అనిల్ రావిపూడి. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేసినా కూడా సరిలేరు నీకెవ్వరులో కామెడీకి పెద్ద పీట వేసాడు అనిల్ రావిపూడి.

ఇక ఎఫ్ 2 సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ కోసం తరుణతాను పూర్తిగా మార్చుకోవాలని చూస్తున్నాడు అనిల్. తాను కూడా మాస్ యాక్షన్ సినిమా చేస్తాను అని రూపించుకోవాలనుకుంటున్నాడు ఈ దర్శకుడు. బాలకృష్ణతో చేయబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని.. కామెడీకి అస్సలు స్కోప్ లేదని తెలుస్తోంది. ఇందులో బాలయ్య మిడిల్ ఏజ్ పర్సన్ గా కనిపిస్తున్నాడు.

balakrishna కూతురుగా శ్రీలీల

ఆయన కూతురుగా పెళ్లి సందడి ఫేమస్ శ్రీలీల నటిస్తోంది. హై రేంజ్ ఎమోషనల్ ఎంటర్టైలర్ గా బాలయ్య సినిమా ఉండబోతుంది దీనికి బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఏదేమైనా బాలకృష్ణతో సినిమా చేస్తే ఆ దర్శకుడు కూడా బాలయ్య లాగే మారిపోవాలి. ఆయన ఆలోచనలకు తగ్గట్టు సినిమా చేయాలి. ఇప్పుడు అనిల్ ఇప్పటికి కూడా అదే సూత్రం అప్లై అవుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Keerthy Suresh | తెలుగు ఇండస్ట్రీపై ‘మహానటి’కి కోపం వచ్చిందా ? ఆ సినిమా కీర్తి సరేశ్‌ కెరీర్‌కు మైనస్‌ అయిందా ?

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Megastar chiranjeevi | చిరంజీవి, రామ్ చరణ్ అవార్డుల వెనుక రాజకీయం ఉందా ? అభిమానులు ఏమంటున్నారు ?

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Haripriya Engagement | కేజీఎఫ్ విలన్‌తో ఘనంగా హీరోయిన్ ఎంగేజ్‌మెంట్

Exit mobile version