Home Latest News AAP MLAs in touch with BJP in Gujarat | గుజరాత్ లో ఆప్...

AAP MLAs in touch with BJP in Gujarat | గుజరాత్ లో ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ కు షాక్ ఇవ్వబోతున్నారా? కాషాయ పార్టీవైపు ఎమ్మెల్యేల చూపులు?

AAP MLAs in touch with BJP in Gujarat | గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితేంది? అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తామన్న కేజ్రీవాల్ కు గుజరాతీలు షాక్ ఇచ్చారు. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటామని ప్రకటించింది. కానీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. 182 స్థానాల్లో పోటీ చేసి కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ సైతం ఘోరంగా ఓడిపోయారు. అయితే 12 శాతం ఓట్లను మాత్రం సంపాదించగలిగింది. అయితే ఇప్పుడు ఆప్ ( AAP ) నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా కేజ్రీవాల్ కు షాక్ ఇవ్వబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆప్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు గతంలో బీజేపీ ఎమ్మెల్యేలే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో వీరు ఆప్ లో చేరి ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని విజయం సాధించారు. వీరిని తిరిగి కాషాయ పార్టీలోకి చేర్చుకునే విషయంపై చర్చలు నడుస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ పుకార్లేనని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. ఆప్ నుంచి గెలిచిన వాళ్లంతా మేలిమి రత్నాలని, ఎట్టి పరిస్థితుల్లో అమ్ముడుపోరని ప్రకటించాడు.

ఆప్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

కానీ తాజాగా ఆప్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే భూపత్ భయానీ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బీజేపీలోకి వెళ్లే విషయంపై స్పందించారు. కాషాయ పార్టీలోకి వెళ్లే విషయం ఇంకా అధికారికంగా ఆలోచించుకోలేదని అన్నారు. కానీ ప్రజలు కోరుకుంటే మాత్రం ఆ పని చేస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

‘రాష్ట్రంలో ఆప్ కు ప్రతిపక్ష హోదాకు సరిపడినంత మంది ఎమ్మెల్యేల బలం లేదు. ఎమ్మెల్యేగానూ ప్రభావం చూపించలేకపోవచ్చు. నేను విజయం సాధించిన నియోజకవర్గంలో రైతులే ఎక్కువగా ఉన్నారు. వ్యాపారులు ఉన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వంతో మంచి సంబందాలు లేకపోతే ఎలా? అందుకే నాకు ఓట్లేసిన ప్రజలను, స్థానిక నేతలను ఓ సారి సంప్రదిస్తాను’ అంటూ పార్టీ అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాట్లాడారు.

ఇప్పట్లో ఆప్ ను వీడకపోయినా బీజేపీ చేరే విషయంలో మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యే క్లారిటీగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కేజ్రీవాల్ కు షాకివ్వడం ఖాయమని అనుకుంటున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Movie Ticket Only for One rupee | హైదరాబాదీలకు బంపర్‌ ఆఫర్‌.. ఒక్క రూపాయికే సినిమా టికెట్‌.. నో కండీషన్స్‌

Keerthy Suresh | తెలుగు ఇండస్ట్రీపై ‘మహానటి’కి కోపం వచ్చిందా ? ఆ సినిమా కీర్తి సరేశ్‌ కెరీర్‌కు మైనస్‌ అయిందా 

Exit mobile version