Home News AP Kodali Nani | చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే.. వాళ్ల ఉసురు కచ్చితంగా తగుల్తది.....

Kodali Nani | చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే.. వాళ్ల ఉసురు కచ్చితంగా తగుల్తది.. కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

kodali nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుంటూరు టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి అవుతున్నారని ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనల్లో మొత్తం 11 మందిని బలిగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. శని గ్రహాన్ని మించిన, జామాత దశమగ్రహం చంద్రబాబు అని విమర్శించారు.

సభల కోసం చంద్రబాబు జనాలను తీసుకొచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కందుకూరులో 8 మంది ప్రాణాలను బలిగొన్నారని, ఆ ఘటనకు చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడులను బాధ్యులను చేయాలన్నారు. ఇప్పుడు కానుకలు ఇస్తామని పది రోజుల నుంచి ప్రచారంతో ఊదరగొట్టారని అన్నారు. ఒక్కో మహిళకు 3 చీరలు ఇస్తామని చెప్పి 30 వేల మందికి టోకెన్లు ఇచ్చారన్నారు. కానుకలు, చీరలు ఇస్తామని దొంగమాటలు చెప్పారని అన్నారు. చంద్రబాబు తన స్పీచ్ కోసం 2.30 గంటల నుంచి జనాలను నిలబెట్టారని వ్యాఖ్యానించారు.

” చంద్రబాబు నలుగురికి చీరలు పంచి హడావిడి చేశారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు. వీళ్ల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అయ్యాక శాసనసభకు వస్తానన్న 420 చంద్రబాబు చనిపోయిన మహిళలకు ఏం సమాధానం చెబుతాడు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. అధికారంలోకి రావడానికి ఎవరెలా చచ్చినా చంద్రబాబుకి అవసరం లేదు” అంటూ చంద్రబాబుపై నాని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని నాని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గుంటూరు ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Kandukuru stampede incident | కందుకూరు తొక్కిసలాటలో అమాయకుల మృతికి కారణమెవరు? ప్రచార పిచ్చే కొంపలు ముంచుతోందా ?

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

World’s Toughest Exams | ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్‌ 3 పరీక్షలు ఇవే.. వీటిలో పాస్‌ అయితేనే ఉద్యోగం, ఉన్నత చదువులు!

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Exit mobile version