Home News AP KA Paul | 30 నిమిషాల టైమ్ ఇస్తే ఏపీ అప్పులన్నీ తీర్చేస్తా.. కేఏ పాల్...

KA Paul | 30 నిమిషాల టైమ్ ఇస్తే ఏపీ అప్పులన్నీ తీర్చేస్తా.. కేఏ పాల్ బంపర్ ఆఫర్

KA Paul | వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ విజయవాడలో అంబేడ్కర్ విగ్రహానికి కేఏ పాల్ వినతి పత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పాయని అన్నారు. టీడీపీ, వైసీపీ గుండాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, హత్యలు మితిమీరాయని ఆరోపించారు. వారివల్ల రాష్ట్రానికి వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా కూడా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు తనను గెలిపించనందుకు బాధపడుతున్నారని కేఏ పాల్ తెలిపారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే జగన్ వెళ్లి మోదీ జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి తనకు గొడవలు జరిగాయని తెలిపారు.

30 నిమిషాలు టైమ్ ఇస్తే అప్పులన్నీ తీర్చేస్తా

ఏపీలో 60 శాతం ప్రజలు తననే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని కేఏ పాల్ చెప్పారు. జగన్ ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. మళ్లీ జగన్‌కే అధికారం అప్పగిస్తే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. జగన్ తనకు 30 నిమిషాల టైమ్ ఇస్తే.. ఆయన్ను కలిసి రాష్ట్రానికి ఉన్న అప్పు మొత్తం తీర్చేస్తానని సంచలన ప్రకటన చేశాడు. అప్పులు మొత్తం తీర్చేశాక రాష్ట్రంలోని నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు.

చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడు

జగన్ తర్వాత మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా కేఏ పాల్ విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు ఏం చేసినా కూడా తన కొడుకు కోసమే చేస్తాడు తప్ప రాష్ట్రం కోసం కాదని విమర్శించాడు. చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని అన్నాడు. టీడీపీ, వైసీపీ, జనసేన ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు వేసినట్టేనని ఆరోపించాడు. ఏపీలో పరిస్థితులు చేజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన పాల్.. ప్రజాశాంతి పార్టీ గెలిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌ వార్నింగ్‌.. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేదే లేదు

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Macherla | రణరంగంగా మారిన మాచర్ల.. టీడీపీ, వైసీపీ శ్రేణుల వీరంగంతో హైటెన్షన్..

Exit mobile version