Home News AP Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని,...

Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం

Perni Nani vs Pawan kalyan | ఏపీలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన ప్రచార రథం ‘వారాహి’ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ వాహనంపై చర్చ నడుస్తుండగా.. ఏపీ రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. మిలటరీ వాహనాలకు వాడే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు వాడటం నిషిద్ధమని చట్టంలో ఉందన్నారు. ఆ రంగు ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ కాదు అన్నారు. అంతేకాదు.. ఎలాగూ మీరు రంగు మార్చాలి కదా అంటూ పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

వారాహికి పసుపు రంగు వేసుకుంటే సరిపోయేదంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ ఎలాగూ తెలుగు దేశం పార్టీతో కలిసి వెళ్లడం ఖాయమని, ప్రధాని చెప్పాడు కాబట్టి ఓ నాలుగు రోజులు ఆగే ప్రయత్నం చేస్తున్నారంటూ పవన్ ను ఉద్దేశించి నాని వ్యాఖ్యానించారు. వ్యాన్లతోనే ఎన్నికల యుద్ధం అయిపోతుందనుకుంటే అందరూ వాటినే కొనేస్తారని, నేనూ కొంటూ అంటూ సెటైర్ వేశారు నాని. ఇలాంటివి సినిమాల్లో అద్భుతంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కు రక్షణ కల్పించకుండానే హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చి వైకాపా నాయకులను తిడుతున్నారా అంటూ విమర్శించారు.

అటు నాని వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. నా సినిమాలను అడ్డుకున్నారు, విశాఖ వెళ్తే హోటల్ నుంచి రానివ్వలేదు, బలవంతంగా విశాఖ నుంచి పంపించారు. మంగళగిరిలో నా కారును అడ్డుకున్నారు, ఇప్పటం గ్రామానికి వెళ్తుంటే ఆపేశారు. ఇప్పుడు ప్రచార రథం వారాహి వాహనంపైనా వివాదం చేస్తున్నారు అంటూ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కనీసం ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశారు. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Hyderabad Express Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Exit mobile version