Home Latest News G20 Summit | విశాఖ వేదికగా జీ-20 సదస్సు.. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్...

G20 Summit | విశాఖ వేదికగా జీ-20 సదస్సు.. ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్

G20 Summit | జీ-20 సదస్సుకు విశాఖ వేదిక కానుంది. జీ-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ నెల నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు దేశంలోని 56 నగరాల్లో 200 సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ నుంచి విశాఖపట్నాన్ని ఎంపిక చేసింది. 2023 ఫిబ్రవరి 3, 4 తేదీలతో పాటు ఏప్రిల్ 4వ తేదీన విశాఖ వేదికగా ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై సదస్సులు జరగనున్నాయి.

ఈ సదస్సులకు వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, విదేశాంగ మంత్రులతో పాటు వేలాది మంది ప్రతినిధులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీ 20 సదస్సుకు సంబంధించిన సన్నాహకాలపై ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్ లతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం

Telangana CM KCR | హైదరాబాదీలకు కేసీఆర్ మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు కూడా మెట్రో

CM KCR | హైదరాబాద్ గురించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఆ విషయంలో భూగోళంలోనే నంబర్ వన్ సిటీ

Hyderabad Express Metro | శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్

Exit mobile version