Home Latest News Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి...

Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి కోటీశ్వరుడయ్యాడు

Dubai lottery | అదృష్టం ఎప్పుడెలా.. ఎవరి తలుపు తడుతుందో తెలియదు. దేశం కాని దేశం వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్న తెలంగాణలోని జగిత్యాల జిల్లా కుర్రాడికి దుబాయిలో భారీ లాటరీ తగిలింది. దాంతో డ్రైవర్‌ కాస్తా కోటీశ్వరుడయ్యాడు. కేవలం 15 దిర్హమ్స్‌తో లాటరీ టికెట్‌ కొటే ఏకంగా రూ. 33.8 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలం తుంగుర్‌కు చెందిన అజయ్‌ ఓగుల (31) బతుకుదెరువు కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడే నాలుగేళ్లుగా ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కష్టాల కడలి నుంచి గట్టెక్కేందుకు అక్కడ రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అందులో ఒకదానికి రూ.33 కోట్ల లాటరీ తగిలింది. ఈ విషయం తెలిసిన అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మొదట్లో నమ్మలేకపోయాడు. షాక్‌ నుంచి తేరుకుని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అజయ్‌ ( ajay ogula )కు ఊరిలో సొంతిల్లు కూడా లేదట. ఇప్పుడు లాటరీలో వచ్చిన డబ్బుతో సొంతిల్లు కట్టుకోవడమే కాకుండా చెల్లెలికి కూడా ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. కుటుంబసభ్యులతో దుబాయ్‌ టూర్‌ వస్తానని చెప్పుకొచ్చాడు. మిగిలన డబ్బుతో సొంతంగా కన్స్‌స్ట్రక్చన్‌ కంపెనీ పెడతానని చెప్పాడు. ప్రస్తుతం అజయ్ గెలుచుకున్న లాటరీ డబ్బులను ఒకే సారి ఇవ్వరు వాయిదాలుగా చెల్లిస్తారట.

దుబాయ్‌లో అధికారికంగా ఎమిరెట్స్‌ లక్కీ డ్రా పేరుతో లాటరీ నిర్వహిస్తున్నారు. ఇక్కడే అజయ్‌ రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఒక్కోటి 15 దిర్హమ్స్‌ విలువతో రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అయితే ఇందులో ఒక టికెట్‌కు అక్కడి కోటిన్నర దిర్హమ్స్‌ ( రూ. 33.8 కోట్లు ) లాటరీ తగిలింది. ఇదే లాటరీలో బ్రిటన్‌కు చెందిన పాలా లీచ్‌ (50) 77,777 దిర్హమ్స్‌ గెలుచుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version