Home News AP AP CM Jagan | ఏపీ సీఎం జగన్‌కు కోపమొచ్చిందా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అంతలా...

AP CM Jagan | ఏపీ సీఎం జగన్‌కు కోపమొచ్చిందా.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను అంతలా మాటలన్నాడు!

AP CM Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు ఎన్నికలొచ్చినప్పుడే వస్తారని, మాయమాటలు చెబుతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అవంగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోతారంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అంటూ చంద్రబాబులా పక్క చూపులు చూసే వ్యక్తిని కాదంటూ జగన్‌ స్పష్టం చేశారు. తాను ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. అటు పవన్ కల్యాణ్‌పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఆ యుద్ధంలో తననే గెలిపించి ఆశీర్వదించాలంటూ జగన్‌ కోరారు.

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగన్‌ బహిరంగ సభలో ప్రసంగించారు. ” ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రమని, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అని చంద్రబాబులా ఆలోచించే వ్యక్తిని కాదు. చంద్రబాబు దత్తపుత్రిడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని తాను అనను” అంటూ సెటైర్లు వేశారు. “ఇదే నా రాష్ట్రం, ఇక్కడే నా నివాసం, ఇక్కడే నా మమకారం, ఇక్కడి 5 కోట్ల ప్రజలే నా కుటుంబ, ఇక్కడే నా రాజకీయం, ఇక్కడి ప్రజల సంతోషమే నా విధానం” అంటూ ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

నాయకుడంటే విశ్వసనీయత ఉండాలన్నారు. మాట మీద నిలబడాలని, అతన్ని చూసి ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకునేలా ఉండాలన్నానరు. వైఎస్‌ఆర్‌ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చామని ఈ సందర్భంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రతి కార్యకర్త గడప గడపకు వెళ్లి గర్వంగా కాలర్‌ ఎగరేసి హామీలన్నీ నెరవేర్చామని చెప్పగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. కొందరు ఎన్నికలప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పి.. మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసి వెళ్లిపోతారంటూ చంద్రబాబును ఉద్దేశించి సెటైర్లు వేశారు. అలాంటి వాళ్లకు.. మాట మీద నిలబడే జగన్‌కు యుద్ధం జరుగుతోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ బిడ్డ నమ్ముకునేది దేవుడిని, మిమ్మల్నే అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌ కానీ మంచి చేస్తే మాత్రం.. చనిపోయినా కూడా జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతామని జగన్‌ అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Junior NTR | ఆంధ్రప్రదేశ్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలి.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version